BRS Fires On Ministers: మాగంటి సునీతని అవమానిస్తారా.. మంత్రులపై బీఆర్ఎస్ ఫైర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:40 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. కమ్మ సామాజికవర్గం వాళ్లు ఓట్లు వేస్తే అదే సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని పేర్కొన్నారు. అదే సామాజికవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని గుర్తుచేశారు. మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎలా అవుతుంది..? అని ప్రశ్నల వర్షం కురిపించారు శ్రీనివాస్ గౌడ్.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారని.. బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ కాంగ్రెస్‌లో చేరారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో మహిళా మేయర్ కనీసం స్పందించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చనిపోతే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫొటోలతో ప్రచారం చేయలేదా..? అని నిలదీశారు. ఆడబిడ్డను మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ అవమానించారని ఫైర్ అయ్యారు. మంత్రుల భాషను మహిళలు గమనించాలని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బయటపడ్డ బోగస్ ఓట్లు
Read Latest Telangana News And Telugu News