Share News

Bogus Votes Hyderabad: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బయటపడ్డ బోగస్ ఓట్లు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:56 PM

ఒకే ఇంట్లో ఒకే వ్యక్తికి 3 ఓట్లు ఉండడంతో బోగస్ ఓట్ల బాగోతం బయటపడింది. దీంతో ఎన్నికల అధికారులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు. వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు విచారణ చేపట్టారు.

Bogus Votes Hyderabad: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బయటపడ్డ బోగస్ ఓట్లు
Bogus Votes Hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by election) బోగస్ ఓట్లు కలకలం రేపుతున్నాయి. వెంగళరావు నగర్‌లో నకిలీ ఓట్లు బయటపడ్డాయి. బూత్ నంబర్ 125లో 27 బోగస్ ఓట్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు గుర్తించారు. ఒకే ఇంట్లో ఒకే వ్యక్తికి 3 ఓట్లు ఉండడంతో బోగస్ ఓట్ల బాగోతం బయటపడింది. దీంతో ఎన్నికల అధికారులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు. తనకు తెలియకుండానే తన ఇంటి నెంబర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు ఓటర్ కార్డులు పొందారని ఇంటి యజమాని చెబుతున్నాడు. ఇంటి ఓనర్ ఫిర్యాదుతో వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు విచారణ చేపట్టారు.


బోగస్ ఓట్లు బయటపడటంతో వెంగళరావు నగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు చోరీ అవుతున్నాయంటూ కాలనీవాసులు మండిపడుతున్నారు.


కాగా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో దొంగ ఓట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న యూసఫ్‌గూడలో దొంగ ఓట్లు బయటపడగా.. తాజాగా వెంగళరావు నగర్‌లో బోగస్ ఓట్ల బాగోతం బయటకొచ్చింది. వెంగళరావు నగర్‌లో ఒకే ఇంట్లో 27 ఓట్లు బయటపడగా.. వారిలో ఒక ఓటరు మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తున్నాడు. మిగిలిన వారు ఎవరో కూడా తమకు తెలియదని యజమాని చెబుతున్నాడు. ఓనర్ భార్య మరణించడంతో ఆ ఇంట్లో యజమాని ఒక్కరే నివాసం ఉంటున్నాడు. ఓటర్ల జాబితాలో ఉన్న వారు ఎవరూ కూడా తమకు సంబంధించిన వారు కాదని, వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని ఇంటి యజమాని చెబుతున్నాడు. ఈ క్రమంలో దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్

వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 01:44 PM