PJR's daughter Vijaya Reddy: కాంగ్రెస్‌ను గెలిపించడమే పీజేఆర్‌కి ఇచ్చే నివాళి: విజయారెడ్డి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:32 PM
పీజేఆర్ కొడుకు విష్ణు చేసిన వ్యాఖ్యలపై పీజేఆర్ కూతురు విజయారెడ్డి స్పందించారు. ఏబీఎన్‌తో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మా నాన్న, పీజేఆర్ కాంగ్రెస్ మనిషి అని, కాంగ్రెస్‌ను గెలిపించడమే పీజేఆర్‌కి ఇచ్చే నివాళి అవుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే పీజేఆర్‌ని గెలిపించినట్టు అవుతుందని చిన్న పిల్లలకి కూడా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వనని పీజేఆర్ కొడుకు విష్ణు చేసిన వ్యాఖ్యలపై పీజేఆర్ కూతురు విజయారెడ్డి స్పందించారు. ఏబీఎన్‌తో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మా నాన్న, పీజేఆర్ కాంగ్రెస్ మనిషి అని, కాంగ్రెస్‌ను గెలిపించడమే పీజేఆర్‌కి ఇచ్చే నివాళి అవుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే పీజేఆర్‌ని గెలిపించినట్టు అవుతుందని చిన్న పిల్లలకి కూడా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరి రాజకీయం కోసం వాళ్లు వాళ్ళకి నచ్చింది మాట్లాడుతారని.. పీజేఆర్‌కి నచ్చింది మాత్రం కాంగ్రెస్ జెండానే అని స్పష్టం చేశారు.
తాను ఉన్నంతకాలంలో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురనీయనని పీజేఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువనర్ధన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ బిడ్డలకు తాను బాబాయ్‌లా అండగా ఉంటానని చెప్పారు. సోమవారం రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్‌పీఆర్‌హిల్స్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 'తమ లాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు బయటికి వచ్చినపుడే ఆ పార్టీ చచ్చిపోయింది. నన్ను కూడా టికెట్ కోసం డబ్బులు అడిగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నేను కష్టకాలంలో ఉన్నపుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నాకు అండగా నిలిచింది. సునీత గెలవడం ఖాయం. తనను 2 సార్లు మాగంటి గోపీనాథ్ ఓడించారు. పీజేఆర్ కుమారుడిని ఓడించానని గోపన్న అంటుండేవారు. కౌంటింగ్ కేంద్రంలో కూడా రాజకీయ ప్రత్యర్థుల్లా కాకుండా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళం' అని గుర్తుచేశారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
ఇంకా చదవండి:
Jubilee Hills Bypoll: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
Rajgopal Reddy On Wine Shops: వైన్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్