Jubilee Hills Bypoll: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:50 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ తెలిపారు. మంత్రి అడ్లూరిని తాను ఏమి అనలేదని స్పష్టం చేశారు. అడ్లూరి గురించి తాను ఎక్కడ మాట్లాడలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పర్యటన కొనసాగుతోంది. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మల నాగేశ్వరరావు వివిధ డివిజన్లలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ అన్నారు. అడ్లూరిని తాను ఏమి అనలేదని స్పష్టం చేశారు. అడ్లూరి గురించి తాను ఎక్కడ మాట్లాడలేదని పేర్కొన్నారు. తాను హుందాగా ఉండాలని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని విమర్శించారు. సారు - కారు 16 అన్నారు.. పార్లమెంట్ ఎన్నికలో ఒక్క సీటు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు ఏమి లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గతంలో రావణాసురిడి పాలన ఉండే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
సునీత దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు: మంత్రి పొన్నం
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని అన్నారు. ఆమెను ఏడవాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయ వేదికలపై ఏడుపులు ఏడవడం మంచి పద్ధతి కాదని పొన్నం హితవు పలికారు. సునీతపై తమకు సానుభూతి ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావులు తమ రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి