Rottweiler vs Cobra: కోబ్రాను పసిగట్టిన రోట్‌వెల్లర్.. చివరికి జరిగింది చూస్తే దడ పుట్టాల్సిందే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 08:15 PM
ఓ ఇంటి పెరట్లోకి నాగుపాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రోట్‌వెల్లర్ జాతికి చెందిన పెంపుడు కుక్క.. పామును పసిగట్టింది. చూసిన వెంటనే దానిపై దాడికి దిగింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు..

ఇళ్లల్లోకి పాములు చొరబడే సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని ప్రదేశాల్లో కనిపించే పాములు చివరకు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు పాములకు కుక్కలు చుక్కలు చూపిస్తుంటాయి. వాటిని వెంబడించి మరీ తరిమేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒళ్లు జలదరించే ఘటన చోటు చేసుకుంది. ఇంటి బయట పెరట్లోకి వచ్చిన కోబ్రా.. రోట్‌వెల్లర్ కుక్క కంటపడింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి పెరట్లోకి నాగుపాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రోట్‌వెల్లర్ జాతికి చెందిన పెంపుడు కుక్క.. పామును పసిగట్టింది. చూసిన వెంటనే దానిపై దాడి చేసేందుకు వెళ్లింది. పాము మీదకు వెళ్లిన కక్కను చూసిన దాని యజమాని.. ‘‘హిట్లర్.. హిట్లర్ వద్దు.. వద్దూ’’.. అంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు.
Train Hits Man: మిరాకిల్ అంటే ఇదే.. యువకుడిని ఢీకొన్న రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..
యజమాని పిలుస్తున్నా సరే.. ఆ కుక్క ఏమాత్రం వినిపించుకోకుండా (Rottweiler attacks cobra) పాముపై దాడి చేసింది. కుక్కను చూడగానే పాము పడగ విప్పి కాటేయడానికి ప్రయత్నించింది. అయితే పాము కాటును తెలివిగా తప్పించుకుంటేనే దాని తల కింద గట్టిగా పట్టేసుకుంది. ఇలా పామును పట్టుకున్న రోట్‌వెల్లర్.. దాన్ని అటూ, ఇటూ వేగంగా తిప్పేస్తూ విదిలించసాగింది. చూస్తుండగానే నాగుపామును రెండు ముక్కలుగా చేసేసింది.
Buffalo Attack On Lion: దున్నపోతులకు కోపం వస్తే ఇంతే.. దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు..
అప్పటికీ వదలకుండా తల భాగాన్ని విసిరేస్తూ ఆడుకుంది. కుక్క చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కుక్క యజమాని ఇదంతా వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ కుక్క పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్క చాలా డేంజర్‌లా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 లక్షలకు పైగా లైక్‌లు, 63 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..