Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
ABN , Publish Date - Mar 12 , 2025 | 08:31 PM
వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో ఓ మహిళ రేకుల షెడ్డు పైకి ఎక్కింది. పైన నిలబడి నడుము అటూ, ఇటూ ఊపుతూ రీల్స్ డాన్స్ చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పల్లెటూరు మొదలుకుని పట్టణాలు, నగరాలు, దేశావిదేశాల వరకూ రీల్స్ ఫీవర్ ఎక్కువ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చిత్రవిచిత్ర రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రేకుల షెడ్డుపై రీల్స్ చేయాలని చూసింది. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో ఓ మహిళ రేకుల షెడ్డు పైకి ఎక్కింది. పైన నిలబడి నడుము అటూ, ఇటూ ఊపుతూ (Woman dances on iron roofing sheet) రీల్స్ డాన్స్ చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Woman Funny Video:ఈమెకు దండం పెట్టాల్సిందే.. హోలీ శుభాకాంక్షలు ఎలా తెలియజేసిందో చూడండి..
రేకుల పైనుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె చీర రేకులకు తగులుకుంది. దీంతో ఆమె ధబేల్‌మని (Woman falls from iron roofing sheet) ముందుకు పడిపోయింది. ఒక్కసారిగా నేలపై పడడంతో ఆమె విలవిల్లాడిపోయింది. ఇలా రీల్స్ కోసం చివరకు ప్రాణం మీదకు తెచ్చుకున్న ఈ మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు.
Funny Viral Video: ఆచీ తూచీ అడుగు వేయమనేది ఇందుకే.. ఇతడికి ఏమైందో చూస్తే పగలబడి నవ్వుతారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఇకపై రీల్స్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుందేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 5.75 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Bike Viral Video: ఈ బైక్‌ను ఢీకొట్టడం అంతా ఈజీ కాదు.. ఎలా తయారు చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..