Share News

Train Viral Video: వేలు ఖర్చు చేసి రైల్లో ఏసీ టికెట్ కొన్నాడు.. తీరా పడుకుందామని చూడగా బెడ్‌పై షాకింగ్ సీన్..

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:32 PM

సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చనే ఉద్దేశంతో ఓ వ్యక్తి రెండు వేల రూపాయలకు పైగా ఖర్చు చేసి రైల్లో ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తీరా పడుకుందామని చూడగా అతడికి ఛేదు అనుభవం ఎదురైంది. దీంతో చివరకు రాత్రంగా జాగారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది...

Train Viral Video: వేలు ఖర్చు చేసి రైల్లో ఏసీ టికెట్ కొన్నాడు.. తీరా పడుకుందామని చూడగా బెడ్‌పై షాకింగ్ సీన్..

రైలు ప్రయాణాలు ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో చిరాకు తెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు ప్రాణం పోయేంత పనవుతుంటుంది. ఇంకొన్నిసార్లు సీటు కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి వింత వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రూ.2000 ఖర్చు చేసి రైల్లో ఏసీ టికెట్ కొన్నాడు. తీరా పడుకుందామని బెడ్‌పై చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైలు ప్రయాణంలో (Train Journey) తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చనే ఉద్దేశంతో సదరు వ్యక్తి రెండు వేల రూపాయలకు పైగా ఖర్చు చేసి రైల్లో ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు.

Accident Viral Video: ప్రమాదం ఎక్కడి నుంచైనా రావొచ్చు.. దంపతులు నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా..


ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. తన సీట్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తికి షాకింగ్ కనిపించింది. ఏసీ కోచ్‌లో (AC Coach) సీటు బుక్ చేసుకున్న వారికి బెడ్ షీట్, దిండు, దుప్పటి ఇస్తారన్న విషయం తెలిసిందే. బెడ్ షీట్ పరిచేసి ప్రశాంతంగా నిద్రపోదామని చూసిన ఆ వ్యక్తి.. తల దిండు కింద చూసి ఖంగుతిన్నాడు. దిండు కింద నంచి ఓ ఎలుక పాక్కుంటూ దుప్పట్లోకి దూరింది. దీంతో అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. తర్వాత మొత్తం పరిశీలించగా.. చాలా ఎలుకలు (Rats) అటూ, ఇటూ తిరుగుతూ కనిపించాయి.

Viral Video: తెలివి ఒకరి సొత్తు కాదంటే ఇదే.. వాడి పడేసిన బ్రష్‌ను తిరిగి ఎలా వాడేసిందంటే..


ఈ ఘటనను అతను వీడియో తీసి.. ‘‘ నా PNR 6649339230, నేను 13288 నంబర్ సౌత్ బీహార్ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణిస్తున్నాను. A1 కోచ్‌లో చాలా ఎలుకలు ఉన్నాయి. అంత డబ్బులు చెల్లించింది ఇందుకేనా’’... అని ప్రస్తావిస్తూ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏసీ కోచ్‌లో ఎలుకలేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘టికెట్ కొంటే ఎలుకలు ఫ్రీగా ఇచ్చినట్టున్నారు’’.. అంటూ మరకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Mar 12 , 2025 | 04:46 PM