Viral Video: తెలివి ఒకరి సొత్తు కాదంటే ఇదే.. వాడి పడేసిన బ్రష్‌ను తిరిగి ఎలా వాడేసిందంటే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 10:00 PM
ఓ మహిళ పక్కన పడేసిన బ్రష్‌ను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఇందుకోసం ముందుగా బ్రష్ తీసుకుని, స్టవ్‌పై వేడి చేసిన కత్తితో పైభాగాన్ని కట్ చేసింది. చివరకు దాన్ని ఎలా చేసిందో చూసి అంతా అవాక్కవుతున్నారు..

కాస్త తెలివి, టెక్నిక్ ఉండాలే గానీ.. పనికిరాదనుకున్న వస్తువును తిరిగి వాడుకలోకి తేవచ్చు. చాలా మంది ఇలాంటి ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. చాలా మంది పక్కన పడేసిన వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి ఆశ్చర్యకర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పక్కన పడేసిన బ్రష్‌ను తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘తెలివి ఒకరి సొత్తు కాదంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పక్కన పడేసిన బ్రష్‌ను (Old Toothbrush) తిరిగి వాడుకలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఇందుకోసం ముందుగా బ్రష్ తీసుకుని, స్టవ్‌పై వేడి చేసిన కత్తితో పైభాగాన్ని కట్ చేసింది. తర్వాత హ్యాండిల్‌ను దానికి వెనుక అంటించింది.
Squirrel Funny Video: ఉరుములు, మెరుపులకు.. ఉడుత వింత ఎక్స్‌ప్రెషన్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఇలా బ్రష్‌ను కట్ చేసి చివరకు క్లీనింగ్ బ్రష్‌లా (Cleaning Brush) తయారు చేసింది. ఆ తర్వాత దాంతో కిటికీలోని దుమ్ము, ధూళిని శుభ్రం చేసింది. ఇలా పనికి రాదనుకుని పక్కన పడేసిన బ్రష్‌ను సైతం వాడుకలోకి తీసుకొచ్చేసిందన్నమాట. ఇలా పక్కన పడేసిన వస్తువులతో విచిత్ర ప్రయోగాలు చేయడం గతంలో చాలా చూశాం. పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని డైనింగ్ టేబుల్‌లా వాడుకున్నాడో వ్యక్తి. అలాగే పాడైన ఫ్యాన్ గార్డ్‌ను కటింగ్ కోసం వాడకున్నాడో బార్బర్.
ఈ విధంగా అనేక మంది తమ తెలివితేటలు వాడి వివిధ రకాల వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేయడం చూశాం. కాగా, మహిళ బ్రష్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్రష్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈమె తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.22 లక్షలకు పైగా లైక్‌లు, 13.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Chicken Viral Video: వామ్మో.. ఇది మాయా.. మంత్రమా.. కోడిని ఏం చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..