Share News

Funny Viral Video: వార్నీ.. వీడెవడండీ బాబూ.. ఆటో డ్రైవర్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి..

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:15 PM

ఓ వ్యక్తి ప్రాంక్ వీడియో చేసేందుకు రోడ్డుపైకి వెళ్లాడు. చేతిలో సంచి పట్టుకుని రోడ్డుపై నిలబడి ఓ ఆటోను ఆపుతాడు. ఆటో ఆగగానే అందులో ఎక్కి కూర్చుంటాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Funny Viral Video: వార్నీ.. వీడెవడండీ బాబూ.. ఆటో డ్రైవర్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో ప్రాంక్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో అనేక రకాల ప్రాంక్ వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌‌పై చేసిన ప్రాంక్ వీడియో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video ) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్రాంక్ వీడియో (Prank Video) చేసేందుకు రోడ్డుపైకి వెళ్లాడు. చేతిలో సంచి పట్టుకుని రోడ్డుపై నిలబడి ఓ ఆటోను ఆపుతాడు. ఆటో ఆగగానే అందులో ఎక్కి కూర్చుంటాడు. అయితే కూర్చునే ముందు తన సంచిలో నుంచి రాయిని బయటికి తీసి, టైరు కింద పెడతాడు.

Food viral video: దీన్ని ఆమ్లెట్ అంటారా.. ఇతడి వింత ప్రయోగం చూస్తే వాంతులు చేసుకోవాల్సిందే..


ఆ వ్యక్తి సీట్లో కూర్చోగానే డ్రైవర్ (Auto Driver) వాహనాన్ని ముందుకు కదలిస్తాడు. అయితే రాయి ఉండడం వల్ల ఆటో ముందుకు కదలదు. అప్పటిదాకా బాగా నడిచిన వాహనం.. ఇలా ఇక్కసారిగా ముందుకు కదలకుండా ఆగిపోవడం చూసి అతను అవాక్కవుతాడు. కిందకు దిగి మొత్తం పరిశీలిస్తాడు. అయితే అతను కిందకు దిగే సమయంలో వెనుక ఉన్న వ్యక్తి వెంటనే టైరు కింద ఉన్న రాయిని తీసి, తన చేతుల్లో పట్టుకుంటాడు. దీంతో డ్రైవర్‌కు కింద ఏమీ కనిపించదు. మళ్లీ స్టార్ట్ చేయాలని చూడగా.. వెనుక ఉన్న వ్యక్తి రాయిని తీసి టైరు కింద పెట్టేస్తాడు.

viral video:ఈ విద్యార్థిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.. ఎలా కాపీ కొడుతున్నాడో చూస్తే.. అవాక్కవుతారు..


ఇలా ఎంతసేపు ప్రయత్నించినా ఆటో ముందుకు కదలకపోవడంతో.. ఏమైందో అర్థం కాక డ్రైవర్‌ అయోమయంలో పడిపోతాడు. ఇలా ఆ వ్యక్తి రాయితో ఆటో డ్రైవర్‌ను ఫూల్ చేస్తాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆటో డ్రైవర్‌ను భలే ఫూల్ చేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది స్క్రిప్టెడ్‌లా అనిపిస్తున్నా కూడా ఫన్నీగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Train Accident video: రీలు చేస్తూ రైలుకు వేలాడిన యువకుడు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Updated Date - Mar 11 , 2025 | 06:15 PM