Food viral video: దీన్ని ఆమ్లెట్ అంటారా.. ఇతడి వింత ప్రయోగం చూస్తే వాంతులు చేసుకోవాల్సిందే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:29 PM
ఓ వ్యక్తి ఆమ్లెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఓ పాన్ తీసుకుని, అందులో నూనె వేసి వేడి చేశాడు. ఆ తర్వాత గుడ్డు సొనను అందులో వేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే దానిపై వింత ప్రయోగం చేశాడు..

చిత్రవిచిత్రమైన వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు వంట చేసే విధానం విచిత్రంగా ఉంటే.. మరికొందరు చేసే విధానం వినూత్నంగా ఉంటుంది. ఇంకొందరు వంట చేసే విధానం చూస్తే.. ‘‘ఇలాక్కూడా చేయొచ్చా’’.. అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి ఫుడ్ వీడియోలను సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆమ్లెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు . ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘దీన్ని ఆమ్లెట్ అంటారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆమ్లెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఓ పాన్ తీసుకుని, అందులో నూనె వేసి వేడి చేశాడు. ఆ తర్వాత గుడ్డు సొనను అందులో వేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే దానిపై వింత ప్రయోగం చేశాడు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
గుడ్డు సొనపై ఓరియో బిస్కట్లను పరిచేశాడు. తర్వాత దాన్ని అటూ, ఇటూ తిప్పి వేడి చేశాడు. చివరగా ఆమ్లెట్‌ను ప్లేటులో వేసి, దానిపై టమాటో సాస్ కూడా వేసేసి, కస్టమర్‌కు అందించాడు. ఇలా ఓరియో బిస్కట్లతో ఆమ్లెట్ వేసి (Omelette with Oreo biscuits) అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral video: వీడిని ఏం చేయాలో మీరే చెప్పండి.. జాతరలో జనం మధ్య బాలిక వెనుక నిలబడి మరీ..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆమ్లెట్ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఓరియో బిస్కెట్లతో ఆమ్లెట్ ఏంట్రా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 59 వేలకు పైగా లైక్‌లు, 5.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Funny Video: ఈమెకు అలా అర్థమైందా.. సిగ్నల్స్ వద్ద ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..