Share News

Viral video: వీడిని ఏం చేయాలో మీరే చెప్పండి.. జాతరలో జనం మధ్య బాలిక వెనుక నిలబడి మరీ..

ABN , Publish Date - Mar 09 , 2025 | 08:01 PM

జాతరలో జనం రద్దీగా ఉంటారు. జాయింట్ వీల్ తదితరాల వద్ద పిల్లలు, పెద్దలు కలిసి సరదాగా గడుపుతుంటారు. ఆ పక్కనే జనమంతా గుమికూడి చూస్తుంటారు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ముందు నిలబడి ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు..

Viral video: వీడిని ఏం చేయాలో మీరే చెప్పండి.. జాతరలో జనం మధ్య బాలిక వెనుక నిలబడి మరీ..

కొందరు శాడిస్టులు చిన్నాపెద్దా, వయసు, వరస అని కూడా చూడకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు కూతురు వయసున్న బాలికలను కూడా వదలకుండా వారి పట్ల వికృతంగా ప్రవర్తిస్తుంటారు. కఠిన శిక్షలు అమలుచేస్తున్నా కూడా ఇలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి జాతరలో జనం మధ్య బాలిక వెనుక నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసిన వారంతా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. జాతరలో జనం రద్దీగా ఉంటారు. జాయింట్ వీల్ తదితరాల వద్ద పిల్లలు, పెద్దలు కలిసి సరదాగా గడుపుతుంటారు. ఆ పక్కనే జనమంతా గుమికూడి చూస్తుంటారు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ముందు నిలబడి ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Woman Funny Video: ఈమెకు అలా అర్థమైందా.. సిగ్నల్స్ వద్ద ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


తన కూతురు వయసున్న విషయం కూడా మర్చిపోయి.. బాలికను వెనుక వైపు తాకుతూ (man misbehaving with girl) అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనను ఎవరూ గమనించలేదనుకుని చాలా సేపు బాలికను ఇబ్బంది పెట్టాడు. కొద్దిసేపటికి అతడి నిర్వాకాన్ని గమనించిన బాలిక తన తల్లికి చెబుతుంది. దీంతో ఆమె తన కూతురును పక్కకు లాగుతుంది.

Facial Viral Video: ఇలాంటి ఫేసియల్ చేయించుకోవాలంటే గట్స్ ఉండాలేమో.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..


అయితే ఇంతలో ఆ వ్యక్తి.. దూరం నుంచి వీడియో తీస్తున్న వ్యక్తిని గమనిస్తాడు. తన నిర్వాకం బయటపడిందనే భయంతో దూరంగా వెళ్లి నిలబడతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వాడిని అందరి ముందూ శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘వీడియో తీసే బదులు.. వెళ్లి అతన్ని మందలించవచ్చుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video:రాత్రి వేళ బస్సులో వ్యక్తి అసభ్య నిర్వాకం.. పక్క సీటులోని వ్యక్తి కెమెరా ఆన్ చేయగా..


ఇవి కూడా చదవండి..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Updated Date - Mar 09 , 2025 | 08:01 PM