Woman Viral Video: మందు కొడితే మహిళ కూడా ఇంతే.. రోడ్డుపై ఏం చేస్తుందో చూడండి..
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:51 PM
ఓ మహిళ ఫుల్‌గా మందు కొట్టి రోడ్డు పైకి వచ్చేసింది. అంతటితో ఆగకుండా వాహనాల ఎదురుగా వెళ్లి మరీ హల్‌చల్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మందుబాబులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు మందు కొడితే చాలు ప్రపంచాన్నే మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు వారు ఇబ్బంది పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. మరికొందరు రోడ్లు, కాలువల్లో పడుకుని విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు . ఇలాంటి వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, మందు తాగిన మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుల్‌గా మందుకొట్టిన ఓ మహిళ.. రోడ్డుపై చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) చోటు చేసుకుంది. ఓ మహిళ ఫుల్‌గా మందు (Drunk woman) కొట్టి రోడ్డు పైకి వచ్చేసింది. అంతటితో ఆగకుండా వాహనాల ఎదురుగా వెళ్లి మరీ హల్‌చల్ చేసింది. ఈ క్రమంలో ఓ బస్సుకు ఎదురుగా వెళ్లి ఆపింది.
Food viral video: దీన్ని ఆమ్లెట్ అంటారా.. ఇతడి వింత ప్రయోగం చూస్తే వాంతులు చేసుకోవాల్సిందే..
బస్సు ముందు వైపు చేతులు పెట్టి నెట్టేసే ప్రయత్నం చేసింది. ఈమె వింత చేష్టలు చూసి షాకైన డ్రైవర్ చాలా సేపు వాహనాన్ని ఆపి ఉంచాడు. ఆ తర్వాత ఆమె రోడ్డుపైనే (Drunk woman lying on road) పడుకుండిపోయింది. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకున్నారు. చివరకు ఆమెను ఎలాగోలా అక్కడి నుంచి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందు కొడితే ఆడ, మగా తేడా లేదు అంటే ఇదేనేమో’’. . అంటూ కొందరు, ‘‘మందుబాబులను మించిపోయిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: వీడిని ఏం చేయాలో మీరే చెప్పండి.. జాతరలో జనం మధ్య బాలిక వెనుక నిలబడి మరీ..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..