Viral Video: ఈ విద్యార్థిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.. ఎలా కాపీ కొడుతున్నాడో చూస్తే.. అవాక్కవుతారు..
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:27 PM
ఓ విద్యార్థి ఎంతో బుద్ధిగా పరీక్ష రాస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందనేగా మీ సందేహం. సిన్సియర్‌గా పరీక్ష రాస్తున్నట్లు నటిస్తూ అతను చేస్తున్న నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

పరీక్షల సమయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు సిన్సియర్‌గా పరీక్ష రాస్తే.. మరికొందరు కాపీలు కొడుతూ రాస్తుంటారు. అయితే టీచర్లకు దొరికిపోకుండా ఏవోవే ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చివరకు ఏదోరకంగా పట్టుబడుతుంటారు. టీచర్లకు దొరక్కుండా ఉండేందుకు కొందరు విద్యార్థులు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారి తెలివితేటలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విద్యార్థికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పరీక్ష రాస్తున్న విద్యార్థి పక్కనే ఉన్న పెన్సిళ్ల బాక్స్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ విద్యార్థిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ విద్యార్థి ఎంతో (student writing exam) బుద్ధిగా పరీక్ష రాస్తున్నాడు. ఇందులో విశేషం ఏముందనేగా మీ సందేహం. సిన్సియర్‌గా పరీక్ష రాస్తున్నట్లు నటిస్తూ అతను చేస్తున్న నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు.
Woman Viral Video: మందు కొడితే మహిళ కూడా ఇంతే.. రోడ్డుపై ఏం చేస్తుందో చూడండి..
సదరు విద్యార్థి పక్కనే రంగు రంగు పెన్సిళ్ల బాక్స్‌ను (Pencil box) పెట్టుకున్నాడు. అయితే అది చూసేందుకే పెన్సిల్ బాక్స్.. తీరా దానిపై వేలు పెట్టగానే పెన్సిళ్లు మాయమై.. అందులో అక్షరాలు దర్శనమిచ్చాయి. వాటిని చూసి పరీక్ష కాపీ కొడుతున్న అతను.. ఎవరికీ అనుమానం రాకుండా ఆ వెంటనే మళ్లీ స్క్రోల్ చేయగా పెన్సిళ్లు కనిపించాయి. ఇలా టచ్ స్క్రీన్‌నే పెన్సిళ్ల బాక్స్‌గా మార్చి, పరీక్ష కాపీ కొడుతున్న ఈ విద్యార్థిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
Food viral video: దీన్ని ఆమ్లెట్ అంటారా.. ఇతడి వింత ప్రయోగం చూస్తే వాంతులు చేసుకోవాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ విద్యార్థి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇవి హైటెక్ తెలివితేటలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 170కి పైగా లైక్‌లు, 9 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: వీడిని ఏం చేయాలో మీరే చెప్పండి.. జాతరలో జనం మధ్య బాలిక వెనుక నిలబడి మరీ..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..