Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 08:56 PM
ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో సిమెంట్ మూటలను లారీలో తీసుకొచ్చారు. అయితే మూటలను అన్‌లోడ్ చేసేందుకు వారు వాడిన ట్రిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా కూలీలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు..

కొందరు చిన్న చిన్న పనులను కూడా ఎంతో కష్టపడి చేస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద పనులను సైతం ఎంతో సులభంగా చేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం కష్టమైన పనులను సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి, మరీ సింపుల్‌గా చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సిమెంట్ బస్తాలను లారీ నుంచి అన్‌లోడ్ చేస్తున్న విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో సిమెంట్ మూటలను (Cement bags) లారీలో తీసుకొచ్చారు. అయితే మూటలను అన్‌లోడ్ చేసేందుకు వారు వాడిన ట్రిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. మూటలను అందరిలా కాకుండా వీరు విచిత్రంగా అన్‌లోడ్ చేశారు.
Chicken Viral Video: వామ్మో.. ఇది మాయా.. మంత్రమా.. కోడిని ఏం చేశాడో చూడండి..
ఇందుకోసం లారీని ప్రహరీ గోడకు ఆనుకుని నిలబెట్టారు. ఆ తర్వాత ఓ పెద్ద చెక్క పలకను లారీ మీదుగా ప్రహరీ గోడ మీదకు వేశారు. ఇలా సెట్ చేసిన తర్వాత సిమెంట్ మూటలను ఎత్తి చెక్క పలకపై వేశారు. తర్వాత చెక్కను పైకి ఎత్తేయగా.. సిమెంట్ మూట ప్రహరీ గోడకు అవతల పని జరుగుతున్న ప్రదేశంలో పడిపోయింది. ఇలా సిమెంట్ బస్తాలను ఎంతో సులభంగా అన్‌లోడ్ (Unload) చేసేశారన్నమాట.
Funny Viral Video: వార్నీ.. వీడెవడండీ బాబూ.. ఆటో డ్రైవర్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి..
ఈ ఘటనను కొందరు దూరం నుంచి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టెక్నిక్‌తో పనిచేయడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వీరి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Train Accident video: రీలు చేస్తూ రైలుకు వేలాడిన యువకుడు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..