Chicken Viral Video: వామ్మో.. ఇది మాయా.. మంత్రమా.. కోడిని ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Mar 11 , 2025 | 08:07 PM
ఓ వ్యక్తి కోడిపై చేసిన వింత ప్రయోగం వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కోడి తలను పట్టుకుని నేలపై పడుకోబెడతాడు. కోడి తలను నేలకు తాకించి పట్టుకుంటాడు. తర్వాత మరో వ్యక్తి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

కొన్నిసార్లు కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు కొందరు పనులు చూస్తే.. ‘‘అరే ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కోడిపై చేసిన వింత ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇది మాయా.. మాంత్రమా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కోడిపై చేసిన వింత ప్రయోగం వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కోడి తలను పట్టుకుని నేలపై పడుకోబెడతాడు. కోడి తలను నేలకు తాకించి పట్టుకుంటాడు. ఇంతలో ఓ వ్యక్తి కోడి ముక్కు దగ్గరగా వేలు పెట్టి, నేలపై మట్టిలో గీత గీసుకుంటూ వెళ్తాడు.
Funny Viral Video: వార్నీ.. వీడెవడండీ బాబూ.. ఆటో డ్రైవర్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి..
అతను అలా ముక్కు వద్ద వేలితో గీత గీస్తుండగానే (chicken fell fell down motionless) ఆ కోడి కదలకుండా పడిపోతుంది. తర్వాత దాన్ని అటూ, ఇటూ కదిలించినా కూడా దానిలో చలనం కనిపించదు. అయితే గీత గీసిన ఆ వ్యక్తి.. కొద్ది సేపటి తర్వాత ఆ గీతను చెరిపేస్తాడు. దీంతో కోడి.. ఒసారిగా మెలకువ వచ్చినట్లుగా అతడి వేలిని ముక్కుతో పొడిచి, అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా కోడిని గీత గీసి హిప్నటైజ్ చేశాడన్నమాట.
Train Accident video: రీలు చేస్తూ రైలుకు వేలాడిన యువకుడు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ఇది ఎంత వరకూ నిజమో ఏమో గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఇదేంటీ.. నిజమా, లేక గ్రాఫిక్సా’’.. అంటూ కొందరు, ‘‘మొత్తం కోడిని భలే హిప్నటైజ్ చేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 5.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..