Squirrel Funny Video: ఉరుములు, మెరుపులకు.. ఉడుత వింత ఎక్స్‌ప్రెషన్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 09:26 PM
వర్షం పడుతున్న సమయంలో ఓ ఉడుత ఓ చెక్క బాక్స్‌లో పడుకుని ఉంటుంది. చెక్క బాక్స్ కావడంతో వర్షం పడుతున్నా కూడా ఉడుత తడవకుండా హాయిగా నిద్రపోతుంటుంది. అయితే ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో ఎలాంటి వారైనా ఉలిక్కిపడడం సర్వసాధారణం. కొందరు ఆ శబ్ధాన్ని భరించలేక కళ్లు, చెవులు మూసుకుంటుంటారు. మనుషులకు ఇది మామూలే అయినా.. ఇలాంటి సమయాల్లో జంతువులు ఎలా ప్రవర్తిస్తాయనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా. ప్రస్తుతం ఇలాంటి వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉరుములు, మెరుపులకు ఉడుత ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఉడుత ఎక్స్‌ప్రెషన్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వర్షం పడుతున్న సమయంలో ఓ ఉడుత ఓ చెక్క బాక్స్‌లో పడుకుని ఉంటుంది. చెక్క బాక్స్ కావడంతో వర్షం పడుతున్నా కూడా ఉడుత తడవకుండా హాయిగా నిద్రపోతుంటుంది. అయితే ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో ఉరుములు, మెరుపులు వస్తాయి.
పెడేల్‌మని గట్టిగా ఉరమడంతో హాయిగా పడుకున్న ఉడుత కాస్తా.. (squirrel was afraid of thunder) ఉలిక్కిపడి లేస్తుంది. లేచిన వెంటే మనుషుల తరహాలో తన ముందు కాలిని గుండెల మీద పెట్టుకుని.. ‘‘వామ్మో.. ఎంత పెద్ద ఉరుము.. ఎక్కడో పిడుగుపడ్డట్టుంది.. అర్జునా ఫల్గుణా.. అర్జునా ఫల్గుణా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఇలా చాలా సేపు అలా గుండెల మీద చేయి పెట్టుకుని భయపడుతూ ఉంటుంది. కాసేపటికి అలా కూర్చునే మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది.
Chicken Viral Video: వామ్మో.. ఇది మాయా.. మంత్రమా.. కోడిని ఏం చేశాడో చూడండి..
ఉడుత ఎదురుగా కెమెరా ఏర్పాటు చేయడంతో ఈ వింత ఎక్స్‌ప్రెషన్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఈ ఉడుత కలలన్నీ చెదిరిపోయాయిగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో గుండె ఆగిపోయినంత పనైందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 8.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..