Accident Viral Video: ప్రమాదం ఎక్కడి నుంచైనా రావొచ్చు.. దంపతులు నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా..
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:42 PM
రాత్రి వేళ్ల దంపతులు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటారు. ఎంతో జాగ్రత్తగా రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తుంటారు. ఇలా కొద్ది దూరం వెళ్లగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘అయ్యో .. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

కొన్నిసార్లు మనం ఎంత కరెక్ట్‌గా ఉన్నా కూడా ఊహించని ప్రమాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంటుంది. ఆఖరికి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్నా కూడా క్షేమంగా ఇంటికి వెళ్తామన్న గ్యారెంటీ ఉండదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దంపతులు నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. పాపం.. తప్పు లేకున్నా ప్రమాదంలో పడ్డాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాత్రి వేళ్ల దంపతులు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటారు. ఎంతో జాగ్రత్తగా రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తుంటారు. ఇలా కొద్ది దూరం వెళ్లగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ వ్యక్తి వెనుక వైపు నుంచి వేగంగా (Scooty hits husband) దూసుకొచ్చి భర్తను ఢీకొడతాడు.
Squirrel Funny Video: ఉరుములు, మెరుపులకు.. ఉడుత వింత ఎక్స్‌ప్రెషన్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
స్కూటీ బలంగా ఢీకొనడంతో ఆ వ్యక్తి దూరంగా ఎగిరిపడ్డాడు. తర్వాత అతను చాలా సేపు చలనం లేకుండా అలాగే పడిపోయి కనిపిస్తాడు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను పరిశీలిస్తే భర్త తీవ్రంగా గాయపడినట్లు కనిపిస్తోంది. అయితే భార్యకు మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
Viral Video: తెలివి ఒకరి సొత్తు కాదంటే ఇదే.. వాడి పడేసిన బ్రష్‌ను తిరిగి ఎలా వాడేసిందంటే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ప్రమాదానికి కారణమైన స్కూటీ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 130కి పైగా లైక్‌లు, 27 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..