Share News

Bike Viral Video: ఈ బైక్‌ను ఢీకొట్టడం అంతా ఈజీ కాదు.. ఎలా తయారు చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:43 PM

కొందరు వాహనాలను చిత్రవిచిత్రంగా తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. బైకును ఆటోగా మార్చడం, ఆటోను కారులాగా డిజైన్ చేయడం, కారుకేమో హెలీకాప్టర్ రెక్కలు తగిలించడం.. ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి..

Bike Viral Video: ఈ బైక్‌ను ఢీకొట్టడం అంతా ఈజీ కాదు.. ఎలా తయారు చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

కొందరు వాహనాలను చిత్రవిచిత్రంగా తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. బైకును ఆటోగా మార్చడం, ఆటోను కారులాగా డిజైన్ చేయడం, కారుకేమో హెలీకాప్టర్ రెక్కలు తగిలించడం.. ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బైకును వినూత్నంగా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘బైక్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన పాత బైకును వినూత్నంగా మార్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం బైకు వెనుక టైరు తీసేసి, వెనుక రెండు వైపులా నాలుగు ఆటో టైర్లను జాయింట్ చేశాడు. తర్వాత బైకు చుట్టూ ఇనుప కబడ్డీలను (Iron bars around the bike) రక్షణ కవచంలా అమర్చాడు.

Crocodile Viral Video: అది మొసలిరా అయ్యా.. నీటిలోంచి ఎలా రప్పించాడో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇలా బైకు చుట్టూ ఇనుప కడ్డీలను జాయింట్ చేడయంతో చూసేవారికి విచిత్రంగా కనిపిస్తోంది. రోడ్డుపై దూసుకుపోతున్న ఈ వాహనాన్ని చూసి అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Train Viral Video: వేలు ఖర్చు చేసి రైల్లో ఏసీ టికెట్ కొన్నాడు.. తీరా పడుకుందామని చూడగా బెడ్‌పై షాకింగ్ సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైక్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వినూత్నమైన బైకును ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీ2డియో ప్రస్తుతం 12వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Mar 12 , 2025 | 06:43 PM