Crocodile Viral Video: అది మొసలిరా అయ్యా.. నీటిలోంచి ఎలా రప్పించాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:07 PM
ఓ వ్యక్తి చేతిలో మాంసం పట్టుకుని నీటి ఒడ్డుకు వెళ్లాడు. నీళ్ల వద్దకు వెళ్లి ఆహారాన్ని చూపిస్తూ అటూ, ఇటూ తిప్పగానే లోపలి నుంచి ఓ పెద్ద మొసలి బయటికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొందరు జంతువులతో ఆటలాడడం అలవాటుగా చేసుకుంటుంటారు. ఇంకొందరు ప్రమాదకర జంతువులతో స్నేహం చేస్తుంటారు. మరికొందరు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, మొసళ్లతో ఫన్నీ గేమ్స్ ఆడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలిని పెంపుడు కుక్కల తరహాలో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అది కుక్క కాదు.. మొసలిరా అయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతిలో మాంసం పట్టుకుని నీటి ఒడ్డుకు వెళ్లాడు. నీళ్ల వద్దకు వెళ్లి ఆహారాన్ని చూపిస్తూ అటూ, ఇటూ తిప్పగానే లోపలి నుంచి ఓ పెద్ద మొసలి బయటికి వచ్చింది. మొసలి రావడం చూసి అతను వెనక్కు జరుగుతూ వెళ్లాడు. అతడి చేతిలో ఆహారాన్ని చూసిన మొసలి.. తినేందుకు ముందుకు కదులుతూ వెళ్లింది.
Accident Viral Video: ప్రమాదం ఎక్కడి నుంచైనా రావొచ్చు.. దంపతులు నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా..
మాంసాన్ని అందుకోవాలని చూడగా.. అతను ఆ మాంసాన్ని పైకి ఎత్తుతూ అందకుండా చేశాడు. ఇలా కొంత దూరం వెనక్కు వెళ్లిన తర్వాత మొసలి ఒక్కసారిగా అతడి చేతిలోని ఆహారాన్ని లాగేసుకుంది. మళ్లీ ఇంకో మాంసం ముక్కను పట్టుకోగా (man feeding meat to crocodile) దాన్ని కూడా అలాగే లాగేసుకుంది. ఇలా పెంపుడు కుక్కలకు ఆహారం అందించే తరహాలోనే ఇతను కూడా మొసలికి ఆహారం తినిపించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మొసలి చేతిలో ప్రాణాలు పోయే పరిస్థితి.
అయితే అతను చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది మొసలి అనుకున్నావా.. లేక పెంపుడు కుక్క అనుకున్నావా’’. అంటూ కొందరు, ‘‘మొసలితో ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6000కి పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..