Woman Funny Video:ఈమెకు దండం పెట్టాల్సిందే.. హోలీ శుభాకాంక్షలు ఎలా తెలియజేసిందో చూడండి..
ABN , Publish Date - Mar 12 , 2025 | 07:56 PM
ఓ మహిళ హోలీని పురస్కరించుకుని అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రకరకాలుగా ఆలోచించి చివరకు వినూత్న ఏర్పాట్లు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

హోలీని పురస్కరించుకుని దేశంలో ఇప్పటి నుంచే సంబరాలు మొదలయ్యాయి. ఒకరిపై ఇంకొంకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కొందరైతే వినూత్న పద్ధతిలో రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఇంకొందరు బెలూన్ల సాయంతో రంగులను వెదజల్లుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ హోలీ శుభాకాంక్షలు తెలియజేసిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈమెకు చేతులెత్తి మొక్కాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ హోలీని పురస్కరించుకుని అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రకరకాలుగా ఆలోచించి చివరకు వినూత్న ఏర్పాట్లు చేసుకుంది.
Funny Viral Video: ఆచీ తూచీ అడుగు వేయమనేది ఇందుకే.. ఇతడికి ఏమైందో చూస్తే పగలబడి నవ్వుతారు..
ఇంట్లోకి వెళ్లగానే ముందుగా నేలపై గాజులు, చెప్పులు, చున్నీ పడి ఉంటాయి. ఆపై మహిళ కాళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇది చూసి మహిళ ఉరి వేసుకుందేమో అని అనుకుంటారు. అయ్యో పాపం.. ఈమెకు ఎంత కష్టం వచ్చిందో.. అని అంతా జాలిపడేలోపే కెమెరా ఆమె తల వైపు టర్న్ అవుతుంది. చనిపోయి కనిపించాల్సిన ఆమె కాస్తా.. (Woman expresses Holi wishes in an innovative way) హాయిగా నవ్వుతూ ‘‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’’.. అని చెబుతుంది.
Bike Viral Video: ఈ బైక్‌ను ఢీకొట్టడం అంతా ఈజీ కాదు.. ఎలా తయారు చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
రెండు చేతుల మధ్యలో తాడు కట్టుకుని వేలాడుతూ, ఇలా ఉరి వేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేసింది. ఇలా వినూత్నంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసిందన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హోలీ శుభాకాంక్షలు ఇలా ఎవరైనా చెబుతారా’’.. అంటూ కొందరు, ‘‘ఓ స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..