Share News

Buffalo Attack On Lion: దున్నపోతులకు కోపం వస్తే ఇంతే.. దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు..

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:06 PM

ఆకలితో ఉన్న సింహానికి దూరంగా దున్నపోతుల మంద కనిపించింది. ఇంకేముందీ.. వాటిని చూడగానే సింహానికి ప్రాణం లేచొచ్చింది. ఎలాగైనా వాటిలో ఒకదాన్ని దాడి చేసి తన ఆకలి తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Buffalo Attack On Lion: దున్నపోతులకు కోపం వస్తే ఇంతే.. దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు..

అడవికి రాజైన సింహం ఒక్కసారి అడుగు బయటికి పెట్టిందంటే.. వేట సొంతమవ్వాల్సిందే. ముందు ఎంత పెద్ద జంతువులన్నా సరే దాని పంజా దెబ్బకు మట్టికరవాల్సిందే. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే.. ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు సింహాలకు చుక్కలు చూపించే జంతువులు కూడా తారసపడుతుంటాయి. టైమ్ బాలోగేలేనప్పుడు వాటి దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతులపై దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు దారుణంగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సింహంతో ఫుట్‌బాల్ ఆడుకున్నాయిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న సింహానికి దూరంగా దున్నపోతుల మంద కనిపించింది. ఇంకేముందీ.. వాటిని చూడగానే సింహానికి ప్రాణం లేచొచ్చింది. ఎలాగైనా వాటిలో ఒకదాన్ని దాడి చేసి తన ఆకలి తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. అయితే దాడి చేస్తే గానీ దానికి అర్థం కాలేదు.. అన్ని రోజులూ తనవి కాదనే విషయం.

Accident Viral Video: ప్రమాదం ఎక్కడి నుంచైనా రావొచ్చు.. దంపతులు నడుస్తూ వెళ్తుండగా.. సడన్‌గా..


సింహం దాడితో దున్నపోతులన్నీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. పారిపోవడం కంటే ఎదురుదాడి చేయడమే కరెక్ట్ అని అనుకున్నాయో ఏమో గానీ.. సింహంపై రివర్స్ ఎటాక్ చేశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా సింహంపై (Buffaloes attack on lion) దాడి చేయడం స్టార్ట్ చేశాయి. కొమ్ములతో ఎత్తి పడేస్తూ సింహానికి చుక్కలు చూపించాయి. ఇలా దున్నపోతులన్నీ మూకుమ్మడిగా దాడి చేయడంతో సింహం తీవ్రంగా గాయపడింది.

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. దున్నపోతుల ఆవేశం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహానికి చుక్కలు చూపించిన దున్నపోతులు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 3.56 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crow Viral Video: వరుసగా మాయమవుతున్న దుస్తుల హ్యాంగర్లు.. చివరకు మేడపై కాకి నిర్వాకం చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2025 | 06:50 PM