Viral Video: ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. బీరు బాటిల్ మూతను ఎంత సింపుల్‌గా ఓపెన్ చేశాడో చూడండి..
ABN , Publish Date - Mar 12 , 2025 | 09:33 PM
ఓ వ్యక్తి బీరు బాటిల్‌ను ఓపెన్ చేసేందుకు వినూత్న ట్రిక్ వాడాడు. సాధరణంగా అంతా బీరు బాటిల్ మూతలను ఓపెనర్స్‌తో తీస్తుంటారు. మరికొందరు నోటితో లాగేస్తుంటారు. అయితే ఇతను మాత్రం ఎంతో సింపుల్‌గా మూతను పీకేశాడు..

సోషల్ మీడియాలో వివిధ రకాల ట్రిక్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కుళాకికి పైపును వినూత్నంగా జాయింట్ చేయడం, పక్కన పడేసి ఖాళీ డబ్బాను ట్యాప్‌గా వాడడం, చెప్పును ఫోన్ స్టాండ్‌గా మార్చడం తదితర వినూత్న విన్యాసాల వీడియోలను నిత్యం చూస్తుంటాం. ఇలాంటి వినూత్న ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బీరు బాటిల్ మూతను ఓపెన్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఐడియా ఏదో బాగుందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బీరు బాటిల్‌ను ఓపెన్ చేసేందుకు వినూత్న ట్రిక్ వాడాడు. సాధరణంగా అంతా బీరు బాటిల్ మూతలను (Beer bottle cap) ఓపెనర్స్‌తో తీస్తుంటారు. మరికొందరు నోటితో లాగేస్తుంటారు. అయితే ఇతను మాత్రం ఎంతో సింపుల్‌గా మూతను పీకేశాడు.
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
ఇందుకోసం తన షూస్ లేస్‌ను (Shoe laces) వాడుకున్నాడు. బాటిల్‌ను తన కాలి వద్ద పెట్టి, దాని చుట్టూ లేస్ చుట్టి పైకి లాగేశాడు. దీంతో మూత సులభంగా ఊడి వచ్చేసింది. ఇలా షూ లేస్ సాయంతో బీరు బాటిల్ మూతలను చకచకా పీకి పడేశాడన్నమాట. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Woman Funny Video:ఈమెకు దండం పెట్టాల్సిందే.. హోలీ శుభాకాంక్షలు ఎలా తెలియజేసిందో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బీరు బాటిల్ మూతను ఇలాక్కూడా ఓపెన్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘పళ్లతో ఈజీగా తీసేయాల్సింది పోయి.. ఇంత కష్టం ఎందుకు బ్రదర్’’. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లు, 21.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: ఆచీ తూచీ అడుగు వేయమనేది ఇందుకే.. ఇతడికి ఏమైందో చూస్తే పగలబడి నవ్వుతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..