Share News

Train Hits Man: మిరాకిల్ అంటే ఇదే.. యువకుడిని ఢీకొన్న రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:13 PM

ఓ యువకుడు ఫుల్‌గా మందు కొట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. చివరకు వాటిపై తల పెట్టి హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి అటుగా ఓ రైలు వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Train Hits Man: మిరాకిల్ అంటే ఇదే.. యువకుడిని ఢీకొన్న రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

అదృష్టం బాగుంటే ఉరుము వచ్చి మీద పడినా కూడా ఏమీ కాదు. అదే టైం బాగోలేకపోతే మాత్రం అరటిపండు తిన్నా కూడా పండు విరిగిపోయే పరిస్థితి ఎదరవ్వొచ్చు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడే వారిని ఎంతో మందిని చూస్తుంటాం. ఇలాంటి మిరాకిల్‌ సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫుల్‌గా తాగిన యువకుడు రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది. చివరకు జరిగింది చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మిరాకిల్ అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పెరూలోని లిమాలో (Peru, Lima) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ఫుల్‌గా మందు కొట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. చివరకు వాటిపై తల పెట్టి హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి అటుగా ఓ రైలు వచ్చేసింది.

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..


రైలు సమీపానికి రాగానే ఆ శబ్ధానికి నిద్రలేచని యువకుడు పక్కకు జరిగేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే రైలు సమీపానికి (Train hits man) వచ్చేయడంతో అతన్ని ఢీకొంది. ఢీకొని కాస్త ముందుకు వెళ్లగానే గమనించిన డ్రైవర్.. ఇంజిన్‌‌ను ఆపేశాడు. అయితే ఈ ఘటనలో ఆశ్చర్యకరంగా అతడికి ఏమీ కాలేదు. కిందపడిన అతను పైకి లేచి.. కాస్త దూరంగా వెళ్లి కూర్చొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి చేతికి స్వల్పగాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Crow Viral Video: వరుసగా మాయమవుతున్న దుస్తుల హ్యాంగర్లు.. చివరకు మేడపై కాకి నిర్వాకం చూసి అంతా షాక్..


ఇలా అంత పెద్ద రైలు ప్రమాదం నుంచి (man survives train accident) ఆ యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి అదృష్టం మామూలుగా లేదుగా’’. .అంటూ కొందరు, ‘‘రైలు పట్టాల వద్ద ఇలాంటి పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Buffalo Attack On Lion: దున్నపోతులకు కోపం వస్తే ఇంతే.. దాడి చేసిన సింహం పరిస్థితి చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2025 | 05:13 PM