Share News

Raghu rama Counter on YS Jagan: జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం:రఘురామ

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:20 PM

ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.

Raghu rama Counter on YS Jagan:  జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్  ఖాయం:రఘురామ
Raghu rama Counter on YS Jagan

పశ్చిమగోదావరి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు (Raghu rama Krishna Raju) హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా ఆయన చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అయిపోతారని ఎద్దేవా చేశారు రఘు రామ.


ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామ పర్యటించారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగానే భావించాలని పేర్కొన్నారు.


వయసులో పెద్దవాడిగా, శాసనసభా ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావడానికి జగన్ సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారని.. ఆ సవాల్‌ను జగన్ స్వీకరించాలని సూచించారు. వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రఘు రామ కృష్ణరాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 01:26 PM