-
-
Home » Andhra Pradesh » Today Latest Breaking News Live Updates in Telugu 7th January 2025 Amar
-
Breaking News: కేటీఆర్‌ను వదిలేదే లేదు.. సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్
ABN , First Publish Date - Jan 07 , 2025 | 11:09 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-07T13:58:46+05:30
సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్
ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో కేటీఆర్ కి చుక్కెదురు
కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
హైకోర్టు తీర్పును కేటిఆర్ సుప్రీంలో సవాలు చేసే అవకాశం
తమ వాదనలు వినకుండా కేటిఆర్ పిటీషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కేవియట్ దాఖలు చేసిన తెలంగాణ సర్కార్
ఫార్ములా ఈ కార్ కేసులో ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు
కేటిఆర్ అరెస్ట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసిన న్యాయస్థానం
ఏసీబీ దర్యాప్తు లో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
చట్ట ప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు
అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు
సుప్రీంకోర్టు వెళ్లే యోచన లో కేటీఆర్
-
2025-01-07T13:01:21+05:30
బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లతో కాంగ్రెస్ దాడి
నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లతో కాంగ్రెస్ దాడి
ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన
బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం
బీజేపీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు
కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలు
రమేష్ బిదురి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
బీజేపీ కార్యాలయంపై కొడిగుడ్లు, రాళ్లతో దాడి
-
2025-01-07T12:04:47+05:30
కుప్పం టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు
కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
పార్టీ కార్యాలయంలో జననాయకుడు సెంటర్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు.
పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్యాలరీ నుంచి ప్రజల నుంచి వినుతులను స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు
-
2025-01-07T11:41:07+05:30
పులివెందులలో దారుణం
పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లి గ్రామంలో దారు ణం
భార్య, కుమార్తె హత్య
భార్యశ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రి లను కొడవలితో గొంతుకోసి చంపేసిన గంగాధర్ రెడ్డి
మద్యానికి బానిస కావడంతో గంగాధర్ రెడ్డి కుటుంబంలో త రచూ గొడవలు
ఇద్దరిని చంపి పరారైన నింది తుడు
-
2025-01-07T11:30:35+05:30
తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ సోదాలు
మాదాపూర్‌లోని గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఏసీఈ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏసీఈ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
-
2025-01-07T11:09:07+05:30
డ్రగ్స్ కలకలం
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయన్న సమాచారంతో అప్రమత్తమైన నందిగామ సబ్ డివిజన్ పోలీసులు
జాతీయ రహదారితో పాటు నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని వివిధ మార్గాలలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు
నందిగామ ఏసిపి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలో సిఐలు, ఎస్సైలు, సిబ్బంది అప్రమత్తం