Share News

Anam Ramanarayana Reddy:జగన్ రాజకీయాల నుంచి తప్పుకో..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విసుర్లు

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:44 PM

Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.

Anam Ramanarayana Reddy:జగన్ రాజకీయాల నుంచి తప్పుకో..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విసుర్లు
Anam Ramanarayana Reddy

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరు నగరంలోని మంత్రి ఆనం నివాసంలో కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం సహాయనిధి నుంచి 27 కుటుంబాలకు రూ.48,63,613లు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.


సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోయారని విమర్శించారు. ఆయన ఇంట్లో కూర్చొని ప్రశ్నలు అడిగితే, అసెంబ్లీలో తాము సమాధానం చెప్పాలా అని నిలదీశారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం చట్టాలు చేసే, చర్చలు జరిపే గౌరవ సభ అసెంబ్లీ అని చెప్పారు. అలాంటి శాసన సభ అంటే జగన్‌కు కనీస గౌరవం లేదా అని ప్రశ్నించారు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మనోవేధన చెందుతున్నారని అన్నారు. కనీసం వారినైనా సభకు రానివ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత వైసీపీకి లేదన్నారు. ఏపీలో అరాచక వాదులకు తావులేదని చెప్పారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీలో అధికారపక్షాన్ని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థులని ప్రజలు‌ ఓడగొట్టారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు.


ఏపీ గవర్నర్‌‌ను వైసీపీ నేతలు అగౌరవపరిచారు

‘ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారు. గవర్నర్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని జగన్ కోపంగా ఉన్నాడు. జగన్‌కు రాజ్యాంగంపై గౌరవం లేదు. ప్రజలపై సదాభిప్రాయం లేదు. జగన్ పత్రిక సాక్షి సమావేశాలు పెట్టి అడిగితే చట్ట సభల్లో తమను సమాధానం చెప్పమనడం హాస్యాస్పదం. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది. లేదంటే ప్రజలే కనీసం ఒక్క సీటు కూడా లేకుండా తగిన శాస్తి చేస్తారు. భారత రాజ్యాంగంపై విశ్వాసం లేకపోతే దేశాన్ని విడిచి జగన్ వెళ్లిపోవాలి. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు. కూటమి ప్రభుత్వం 20 ఏళ్ల పాలన చేస్తే కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరవు. గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. వైసిపీ పాలనలో గెలిచిన సర్పంచ్‌ల సమస్యలను జగన్ పట్టించకోలేదు’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 09 , 2025 | 01:45 PM