Share News

Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్

ABN , Publish Date - Mar 09 , 2025 | 10:04 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలకు పాల్పడిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌... పోలీసులు తనకోసం గాలిస్తున్న విషయం తెలుసుకుని తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోపై అనంతపురం పోలీసులు సీరియస్ అయ్యారు. ఫోర్జరీ మెడికల్ సర్టిఫికెట్ విషయాన్ని దాచి వీడియోలో మొసలి కన్నీరు కార్చుతున్నాడంటూ మండిపడ్డారు.

Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై  పోలీసుల సీరియస్
Borugadda Anil

అనంతపురం:రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) వీడియో (Video)పై అనంతపురం పోలీసులు (Anantapuram Police) సీరియస్ (Serious) అయ్యారు. ఫోర్జరీ మెడికల్ సర్టిఫికెట్ (Forged medical certificate) విషయాన్ని దాచి వీడియోలో మొసలి కన్నీరు కార్చిన బోరుగడ్డ అనిల్ 111సెక్షన్ వర్తించందంటూ వీడియో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్త్ టౌన్ సిఐ సాయినాథ్ వేధించారంటూ ఆరోపించడం వెనుక బోరుగడ్డ అనిల్ బెదరింపు ధోరణి ఉందని, బోరుగడ్డ కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తెలంగాణాలో ఉంటూ వీడియో రిలీజ్ చేసినట్లు అనంతపురం పోలీసులు గుర్తించారు. కాగా ఇప్పటికే అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు బెయిల్ కోసం పోర్జరీ సర్టిఫికెట్ సృష్టించిన దానిపై పూర్తి ఆధారాలతో గుంటూరు పోలీసులు అనంత పోలీసులకు నివేదిక అందచేశారు.

ఈ వార్త కూడా చదవండి..

కీలకమలుపు తిరిగిన రన్యారావు కేసు..


గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలకు పాల్పడిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌... పోలీసులు తనకోసం గాలిస్తున్న విషయం తెలుసుకుని తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. గతంలో దందాలు, దౌర్జన్యాలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ను ఇష్టమొచ్చినట్టు దూషించిన కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు నుంచి బెయిల్‌ పొడిగింపు కోసం ఫోర్జరీ మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించిన విషయాన్ని దాచి ఆ వీడియోలో మొసలి కన్నీరు కార్చాడు. తన తల్లి కోసమే బెయిల్‌పై వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. రాజ్యాంగబద్ధంగానే తనకు బెయిల్‌ వచ్చిందన్నాడు. తనకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని, ఈ విషయంలో ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వాగతిస్తానని చెప్పుకొచ్చాడు. హైకోర్టుకు ఫోర్జరీ లెటర్‌ సమర్పించిన విషయాన్ని ప్రస్తావించకుండా ప్రజలను, మీడియాను, కోర్టులు, పోలీసులను సైతం తప్పుదారి పట్టించేలా వీడియో విడుదల చేశాడు. తన నైజాన్ని మరోసారి ప్రదర్శించి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆందోళన చెందుతున్నట్లు మాట్లాడాడు.


తనకు గానీ, తన కుటుంబానికి గానీ హాని జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్‌ బాధ్యత వహించాలన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న పోలీసులు బోరుగడ్డ వెనుక బలమైన శక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జైలు నుంచి విడుదలయినప్పటి నుంచి బోరుగడ్డ ఎవరెవరిని కలిశాడు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన వీడియోను ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అనేదానిపై ఆధారాలు ేసకరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో టెక్నికల్‌ బృందం పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. తాను తల్లితో చెన్నైలోనే ఉన్నట్లు బోరుగడ్డ చెప్పినప్పటికీ ఆయన తెలంగాణలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు వైసీపీ నాయకులు ఆశ్రయం ఇచ్చినట్లు కూడా పోలీసుల దృష్టికివచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం..

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 09 , 2025 | 10:13 AM