Share News

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

ABN , Publish Date - Mar 09 , 2025 | 07:53 AM

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు.

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ
Arasavelli Surya Narayana Swamy

శ్రీకాకుళం: అరసవెళ్లి (Arasavelli) సూర్యనారాయణ స్వామి (Suryanarayana Swamy) భక్తులకు (devotees) తీవ్ర నిరాశ (Disappointment) కలిగింది స్వామివారి మూలవిరాట్‌ను సూర్య కిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు (Sun rays) మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మబ్బులు, పొగమంచు కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ప్రతీ ఏటా ఉత్తరాయణం మార్చి 9,10 తేదీలలోను దక్షిణాయణం అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. మరి సోమవారం అయినా భక్తులకు ఆ అదృష్టం దక్కుతుందో లేదో చూడాలి.

Read More News.. :

కీలకమలుపు తిరిగిన రన్యారావు కేసు..


కాగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి మారే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 9, 10 తేదీల్లో తెల్లవారుజామున భానుడి కిరణాలు అరసవల్లి ఆలయంలోని మూల విరాట్టును తాకే అవకాశం ఉందని ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ, ఈవో వై.భద్రాజీ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కావడం, అదే రోజు సూర్యకిరణాలు తాకనుండటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథయంలో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏ వేలికి ఏ ఉంగరం ధరించాలంటే..

జగన్‌కు చెక్ పెట్టిన చంద్రబాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 09 , 2025 | 07:53 AM