Share News

Minister Kollu Ravindra Fires on Perni Nani: విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

ABN , Publish Date - Oct 07 , 2025 | 07:27 PM

మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.

Minister Kollu Ravindra Fires on Perni Nani: విడిచి పెట్టం.. పేర్నినానికి  మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
Minister Kollu Ravindra Fires on Perni Nani

కృష్ణా, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ (YSRCP) పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని నిలదీశారు. ఇవాళ(మంగళవారం) కృష్ణా జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. తంబల్లపల్లి కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నామని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర.


ఎంతటి వాళ్లు ఉన్నా విడిచి పెట్టం, అవసరమైతే పీడీ యాక్ట్‌లు కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తంబల్లపల్లి వద్ద కల్తీ మద్యాన్ని గుర్తించింది తమ ఎక్సైజ్ శాఖ అధికారులేనని స్పష్టం చేశారు. నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తున్నామని.. కాబట్టే కల్తీ మద్యాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ వాళ్లు ఇద్దరు ఉన్నారని తెలిసిన వెంటనే.. ఆ ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసులు నమోదు చేయించామని గుర్తుచేశారు మంత్రి కొల్లు రవీంద్ర.


కల్తీ మద్యంపై శాఖాపరంగా సమగ్ర విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో మద్యాన్ని పరీక్షించిన తర్వాతనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

జగన్‌కు హెలికాఫ్టర్ ఓకే.. రోడ్ షోకు నో పర్మిషన్

ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 07:38 PM