Share News

PM Modi Srisailam visit: ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:57 PM

సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని మాధవ్ తెలిపారు.

PM Modi Srisailam visit: ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే
PM Modi Srisailam visit

నంద్యాల, అక్టోబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈనెల 16న శ్రీశైలం క్షేత్ర పర్యటన ఖరారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పర్యటించే ప్రదేశాలైన ఛత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. ఈరోజు (మంగళవారం) శివాజి రాజదర్బార్, శివాజి ధ్యానమందిరం ఏర్పాట్లను ఎంపీ బైరెడ్డి, శబరి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ.. సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు.


ప్రధాన మంత్రి మోదీ మొదటిసారిగా శ్రీశైలం రావడం శుభ పరిణామమని అన్నారు. ప్రధాని శ్రీశైలం పర్యటనతో క్షేత్ర వైభవం మరింత పెరుగుతుందన్నారు. శ్రీశైలం ప్రాంతం యొక్క విశిష్టత టూరిజం అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క విశేషాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం శివాజి స్ఫూర్తి కేంద్రానికి ప్రధాన మంత్రి మోదీ చేరుకుంటారని మాధవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

డ్రైవింగ్‌లో ఇలా చేయడం డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు... భూమనకు మంత్రి మండిపల్లి వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 01:57 PM