Share News

Mobile Phone use Traffic Violation: డ్రైవింగ్‌లో ఇలా చేస్తే డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

ABN , Publish Date - Oct 07 , 2025 | 09:18 AM

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజా ట్వీట్ ద్వారా రోడ్డు భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ సమయంలో..

Mobile Phone use Traffic Violation: డ్రైవింగ్‌లో ఇలా చేస్తే డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
Mobile Phone use Traffic Violation

హైదరాబాద్: పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజా ట్వీట్ ద్వారా రోడ్డు భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్స్ వినియోగించడం వంటి చర్యలు ప్రమాదకరమైనవే కాకుండా శిక్షార్హమైనవి అని ఆయన హెచ్చరించారు.


ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీలను నడుపుతున్న డ్రైవర్లు ఇలా చేస్తూ తరచుగా కనిపిస్తున్నారన్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ వాడటం వల్ల వారి దృష్టి రోడ్డుపై ఉండదని, ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి నిర్లక్ష్య చర్యలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.


డ్రైవర్, ప్రయాణికులు, ఇతర రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత అత్యంత ముఖ్యమైనదన్నారు. జీవితం కంటే పెద్దది ఏ సమస్య కాదన్న సజ్జనార్.. ప్రతి ఒక్కరూ రోడ్డుపై భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్షణిక అవసరాల కోసం ప్రాణాలు పొగొట్టుకోవద్దని సూచించారు.

Also Read:

పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది.. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆగ్రహం..

వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్..

For More latest News

Updated Date - Oct 07 , 2025 | 10:02 AM