Share News

India Pakistan UN: పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది.. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆగ్రహం..

ABN , Publish Date - Oct 07 , 2025 | 08:28 AM

పాకిస్థాన్ తన స్వంత ప్రజల పైనే బాంబులు వేస్తోందని, క్రమబద్ధమైన మారణహోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో మంగళవారం మహిళలు, శాంతి, భద్రతలపై బహిరంగ చర్చ జరిగింది.

India Pakistan UN: పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది.. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆగ్రహం..
India slams Pakistan

పాకిస్థాన్ తన స్వంత ప్రజల పైనే బాంబులు వేస్తోందని, క్రమబద్ధమైన మారణహోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ (UN Ambassador Parvathaneni Harish) ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో మంగళవారం మహిళలు, శాంతి, భద్రతలపై బహిరంగ చర్చ జరిగింది. ఈ సమావేశంలో హరీష్ మాట్లాడుతూ.. పాక్ క్రమబద్ధమైన జాతి నిర్మూలన చేస్తోందని, అతిశయోక్తులు, అబద్ధాలతో ప్రపంచం దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని అన్నారు (India Pakistan UN).


కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరిస్తున్నారని పాక్ అధికారి ఆరోపణకు సమాధానంగా హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మహిళలు, శాంతి, భద్రతల విషయంలో మేం ఎప్పటికీ రాజీ పడం. మా మార్గదర్శక రికార్డు మచ్చలేనిది. అది ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. తన స్వంత ప్రజలపై బాంబులు వేసే, క్రమబద్ధమైన మారణహోమం నిర్వహించే దేశం అబద్ధాలు, అతిశయోక్తులతో ప్రపంచం దృష్టి మరల్చడానికి మాత్రమే ప్రయత్నించగలదు` అని పాక్‌ను ఉద్దేశిస్తూ హరీష్ అన్నారు (India slams Pakistan).


ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవ హక్కుల రికార్డులు కలిగిన దేశం పాక్ అని హరీష్ విమర్శించారు (India Pakistan tensions). పాకిస్థాన్‌లోని మైనారీటీలపై జరుగుతున్న దాడుల గురించి గత వారం కూడా భారత్ స్పందించింది. 'ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవ హక్కుల రికార్డులు కలిగిన దేశం ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది మాకు చాలా విడ్డూరంగా ఉంది' అని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కె.ఎస్. మొహమ్మద్ హుస్సేన్ పాక్‌ను విమర్శించారు.


ఇవి కూడా చదవండి:

అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 07 , 2025 | 08:29 AM