YCP Digital Book: వైసీపీ డిజిటల్ బుక్.. సీన్ రివర్స్..
ABN , Publish Date - Oct 07 , 2025 | 08:26 AM
మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.
శ్రీ సత్యసాయి: వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ అయ్యింది. మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు చేరింది. వివరాల్లో వెళ్తే.. మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తిప్పేస్వామికి రూ. 75 వేలు ఇచ్చినట్లు దోక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు కూడా డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తిప్పేస్వామిపై వైసీపీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి .
మాజీ సీఎం జగన్.. డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని జగన్ చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాన్నారు. కూటమి సర్కార్ రెడ్‌బుక్ అంటోందని, రేపు డిజిటల్ బుక్ ఏమిటన్నది చూపిస్తామని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వైసీపీ డిజిటల్ బుక్ వ్యవహారం వల్ల మొదటికే మోసం వచ్చింది. డిజిటిల్ బుక్‌లో ఇతర పార్టీ నాయకులపై ఫిర్యాదుల కంటే.. సొంత వైసీపీ నాయకులపైనే ఫిర్యాదులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. దీంతో వైసీపీకి భారీ ఎదురదెబ్బ తగిలినట్లైంది.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..