Mandipalli Slams Bhuma Karunakar: త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు... భూమనకు మంత్రి మండిపల్లి వార్నింగ్
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:25 AM
అధికార మదంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని, భక్తుల విశ్వాసంతో చెలగాటమాడారని మంత్రి మండిపల్లి మండిపడ్డారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు నాణ్యమైన భోజనం కూడా కష్టమయ్యే పరిస్థితిని సృష్టించిన పాపం గత పాలకులదే అంటూ దుయ్యబట్టారు.
అమరావతి, అక్టోబర్ 7: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై (Former TTD Chairman Bhumana Karunakar Rreddy) మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత పాలక మండలి హయాంలో టీటీడీలో భక్తులకు కనీస సదుపాయాలు కరువయ్యాయని విమర్శించారు. దేవస్థానం అంటే రాజకీయ అడ్డా కాదని, గత పాలనలో టీటీడీని రాజకీయాలతో కలుషితం చేశారని ఆరోపించారు. అధికార మదంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని, భక్తుల విశ్వాసంతో చెలగాటమాడారని మండిపడ్డారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు నాణ్యమైన భోజనం కూడా కష్టమయ్యే పరిస్థితిని సృష్టించిన పాపం గత పాలకులదే అంటూ దుయ్యబట్టారు.
భూమన చేసిన వ్యాఖ్యలు స్వామి వారిని, భక్తులను అగౌరవపరిచేలా ఉన్నాయన్నారు. దేవుడితో చెలగాటాలు ఆడితే, ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను దిగజార్చలాని, అపవిత్ర ఆలోచనతో విధిగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవుపలికారు. ఇకపై ధార్మిక సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని ఉపేక్షించేది లేదని.. పాత తప్పులు పునరావృతం కావని స్పష్టం చేశారు. టీటీడీకి భూమన చేసిన అన్యాయానికి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటన.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్
డ్రైవింగ్‌లో ఇలా చేయడం డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
Read Latest AP News And Telugu News