Share News

Nellore Murders: నెల్లూరులో జంట హత్యల కలకలం

ABN , Publish Date - Oct 07 , 2025 | 10:28 AM

ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన‌ స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు పేర్కొన్నారు.

Nellore Murders: నెల్లూరులో జంట హత్యల కలకలం
Nellore Double Murder

నెల్లూరు: నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. రంగనాయకులపేట తిక్కన పార్కు‌ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని యువకుల దారుణహత్యకు గురయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు. ఇద్దరు యువకులని దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.


పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన‌ స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు పేర్కొన్నారు. గ్రూపుల మధ్య పాతకక్ష్యలే కారణమనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Updated Date - Oct 07 , 2025 | 10:28 AM