Ambedkar Statue Fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటన.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:06 AM
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టక పోయినా పెట్టినట్లు ఘటనను సృష్టించి స్థానిక టీడీపీ నాయకులపై నెపం నిట్టే ప్రయత్నానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఒడిగట్టారు.
చిత్తూరు, అక్టోబర్ 7: ఏపీలో సంచలనం సృష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం మంటల అంటుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బొమ్మాయపల్లి సర్పంచ్ గోవిందయ్యను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుషార్ డూడే వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టక పోయినా పెట్టినట్లు ఘటనను సృష్టించి స్థానిక టీడీపీ నాయకులపై నెపం నిట్టే ప్రయత్నానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఒడిగట్టారు. ఈనెల మూడో తేదీన అర్ధరాత్రి ప్రమాదవశాత్తు విగ్రహానికి ఆనుకుని ఉన్న పూరిపాకకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.
ఆ మంటలు చెలరేగి అంబేద్కర్ విగ్రహానికి తాకింది. పాక్షికంగా విగ్రహం కాలింది. పూరిపాక యజమానురాలతో కలిసి డ్రామా సృష్టించి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు అంటూ గోవిందయ్య క్రియేట్ చేసి వివాదానికి కారణం అయ్యాడు. ఈ వివాదం దళిత సంఘాలు, వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య పెద్ద దుమారం కలిగించింది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసు వాస్తవ పరిస్థితులను గుర్తించి వివాదానికి కారకుడైన గోవిందయను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరి కొంతమంది పైన కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తామని ఎస్పీ తుషార్ డూడే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డ్రైవింగ్‌లో ఇలా చేయడం డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
కాంగ్రెస్‌కు షాక్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతపై క్రిమినల్ కేసు
Read Latest AP News And Telugu News