Share News

Naveen Yadav: కాంగ్రెస్‌కు షాక్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతపై క్రిమినల్ కేసు

ABN , Publish Date - Oct 07 , 2025 | 08:57 AM

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Naveen Yadav: కాంగ్రెస్‌కు షాక్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతపై క్రిమినల్ కేసు
Jubilee Hills Election

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్‌ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనల మీద అధికారుల సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అవ్వడం కాంగ్రెస్‌కు భారీ దెబ్బగా చెప్పుకొవచ్చు. నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా అనుకున్నట్లు రాజకీయా వర్గాల్లో వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్‌పై కేసు నమోదు అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా.. ఎన్నికల సంఘంకు ఎంపీ రఘునందన్ రావు, నవీన్ యాదవ్‌ జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులు అందజేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన ఎన్నికల సంఘం.. నవీన్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Updated Date - Oct 07 , 2025 | 09:11 AM