Share News

Palla Srinivas Rao: జగన్ తన బుద్ధి మార్చుకోవాలి.. పల్లా శ్రీనివాస్ రావు ఫైర్

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:07 PM

జగన్‌ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్‌కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.

Palla Srinivas Rao: జగన్ తన బుద్ధి మార్చుకోవాలి.. పల్లా శ్రీనివాస్ రావు ఫైర్
Palla Srinivas Rao

అమరావతి, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (Pulivendula ZPTC Bye Election) తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivas Rao) స్పదించారు. పులివెందుల ప్రజలకు ఒక రోజు ముందుగానే స్వాతంత్య్రం వచ్చిందని ఉద్ఘాటించారు. ఏబీఎన్‌తో పల్లా శ్రీనివాస్‌ రావు మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లు బ్యాలెట్ బాక్స్‌ల్లో వేశారని వెల్లడించారు. జగన్‌ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్‌కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజల ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.


జ‌గ‌న్ వైసీపీ జెండా పీకేయ‌డం ఖాయం: మంత్రి అచ్చెన్నాయుడు

ATCHENNAIDU.jpg

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 6,735 ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృద‌యపూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. అభివృద్ధే తెలుగుదేశం పార్టీని గెలిపించిందని ఉద్ఘాటించారు. పులివెందుల ప్ర‌జ‌లు అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన టీడీపీపై విశ్వాసం ఉంచారని నొక్కిచెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పేదల సంక్షేమ పథకాలు,పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగావకాశాలు టీడీపీని గెలిపించాయని చెప్పుకొచ్చారు. పులివెందుల ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌తో ఉన్నారని.. అందుకే వైసీపీ అభ్య‌ర్థి డిపాజిట్ కోల్పోయారని అన్నారు. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించిందని ఉద్ఘాటించారు. జ‌గ‌న్ వైసీపీ జెండా పీకేయ‌డం ఖాయమని విమర్శించారు. జ‌గ‌న్ అరాచ‌క, నిరంకుశ, అవినీతి పాల‌న‌కు ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ఇదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఓటు హక్కుతో జగన్ చెంప చెల్లుమనిపించారు: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

Kalisetti-Appala-Naidu-1.jpg

పులివెందుల టీడీపీ గెలుపుపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. పులివెందుల కూటమి విజయం, జగన్‌కు జ్ఞానోదయమని హితవు పలికారు. జగన్ రెడ్డి నోటి దురుసుతనం తగ్గించుకొని తనని తాను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యం గెలిచిందనే సంతోషంలో పులివెందుల ప్రజానీకం సంబరాలు జరుపుకుంటున్నారని ఉద్ఘాటించారు. పులివెందుల ప్రజలు తమ ఓటు హక్కుతో జగన్ మోహన్ రెడ్డి చెంప చెల్లుమనిపించారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.


పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ: బుద్దా వెంకన్న

9Budda.jpg

ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. కానీ పులివెందుల ప్రజలకు ఈ ఏడాది ఒకరోజు ముందుగానే స్వాతంత్య్రం వచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఉద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (X) వేదికగా బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 30ఏళ్లుగా వైఎస్ కుటుంబ పాలనలో నలిగిపోయిన పులివెందుల ప్రజలు వారి సంకెళ్లు తెంచుకొని నేడు ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారని నొక్కిచెప్పారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కలయికలో నేడు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్యానించారు. ఈ కలయిక మరో 30ఏళ్ల పాటు కొనసాగుతూ ప్రజలు నిజమైన ప్రజాపాలనను చూస్తారని బుద్దా వెంకన్నపేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు

పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: మారెడ్డి లతారెడ్డి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 01:20 PM