Share News

Narayana Fires ON YS Jagan: అమరావతిపై దుష్ప్రచారం.. జగన్ అండ్‌కోకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:17 PM

అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.

Narayana Fires ON YS Jagan: అమరావతిపై దుష్ప్రచారం.. జగన్ అండ్‌కోకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్
Minister Narayana Fires ON YS Jagan

అమరావతి, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ (Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని హెచ్చరించారు. అమరావతి గురించి ఏసీ రూముల్లో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అధారిటీ ఆమోదించిందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.


ఇవాళ(ఆదివారం) అమరావతిలో (Amaravati) మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ -1,టైప్ 2 ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై సీఆర్డీయే ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. భూ సమీకరణతో రైతులకు ఎక్కువ లాభమని ఉద్ఘాటించారు. అమరావతిలో గెజిటెడ్, గ్రూప్-డీ అధికారుల కోసం మొత్తం 14 టవర్స్‌లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ.


టైప్ -1లో 384 ఇళ్లు, టైప్ - 2లో 336 ఇళ్లు, గ్రూప్ -డీ అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీలోగా అన్ని టవర్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఫిబ్రవరి ఒకటో తేదీకి నిర్మాణాలను పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని వెల్లడించారు. మొత్తం 4400 ఇళ్లలో 3750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు, ఉద్యోగులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ట్రంక్ రోడ్లను ఏడాదిలో, లే అవుట్ రోడ్లను రెండున్నరేళ్లలో, ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..

కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 07 , 2025 | 12:33 PM