AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:47 AM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఈ పిటీషన్‌పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.
విజయవాడ, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP liquor Scam Case) ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు (SIT Officials). ఈ పిటీషన్‌పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న(శనివారం) బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో వీరి ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు.
లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ ఆర్డర్స్‌పై తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని సిట్ అధికారులు (SIT Officials) అంటున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) ఇచ్చిన ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్స్‌పై స్టే విధించాలని హై కోర్టును కోరనున్నారు సిట్ అధికారులు. ఈరోజు ఆదివారం కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. అయితే, ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్‌పై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు సిట్ అధికారులు.
నిందితుల విడుదల..
మద్యం కేసు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ముగ్గురు నిందితులను విడుదల చేశారు జైలు అధికారులు. అయితే కావాలనే ఆలస్యంగా విడుదల చేశారని ధనుంజయ రెడ్డి తెలిపారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..
Read Latest Andhra Pradesh News and National News