AP Police Shock to Kethireddy Pedda Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:16 AM
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి ట్విస్ట్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు . నిన్న(శనివారం) తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించారు పోలీసులు. ఇవాళ(ఆదివారం) తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు.
అనంతపురం, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Kethireddy Pedda Reddy) ట్విస్ట్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు. నిన్న(శనివారం) తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించారు పోలీసులు. అయితే, ఇవాళ(ఆదివారం) తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డికి సూచించారు పోలీసులు. ఈనెల(సెప్టెంబరు) 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలను ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రి (Tadipatri) రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచనలు చేశారు. కేతిరెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు (Supreme Court). అనంతపురం ఎస్పీ జగదీష్‌కు మెయిల్ ద్వారా లేఖ పంపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని మెయిల్‌లో పేర్కొన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. 24 గంటలకే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల సూచనలతో తాడిపత్రి నుంచి తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..
Read Latest Andhra Pradesh News and National News