Share News

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 25 , 2025 | 08:31 PM

‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.

CM Chandrababu On Cyclone: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu On Cyclone

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో అధికారులు తక్షణం సన్నద్ధమవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు.


అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఇవాళ(శనివారం) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ‘మొంథా’ తుపానుపై అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

Forest Protection

మొంథా తుపానుపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిశానిర్దేశం చేశారు. ఇవాళ(శనివారం) టెలి, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్ కల్యాణ్.


తుపాను కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలకు ఎప్పటికప్పుడూ సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో కాకినాడ వెళ్లి దగ్గరుండి సమీక్షిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితుల్లో కాకినాడ వెళ్లవద్దని పవన్‌ను కోరారు అధికారులు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 09:04 PM