Share News

CM Chandrababu on GST Reforms: రైట్ లీడర్, రైట్ టైమ్.. 2047లో ఫస్ట్ ప్లేస్‌లో భారత్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:29 PM

జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu on GST Reforms: రైట్ లీడర్, రైట్ టైమ్.. 2047లో ఫస్ట్ ప్లేస్‌లో భారత్: సీఎం చంద్రబాబు
CM Chandrababu on GST Reforms

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ 2.0 సంస్కరణలను (GST Reforms) స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మాట్లాడారు. దేశంలో తొలిసారిగా జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఏపీ శాసనసభ తీర్మానం చేసిందని తెలిపారు. జీఎస్టీ 2.0 కొత్త శ్లాబుల వల్ల జరిగే ప్రయోజనాల గురించి శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తన రాజకీయ జీవితంలో మొదటిసారి ఇలాంటి జీఎస్టీ సవరణలు చూశానని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.


గతంలో డబ్బులు లేనప్పుడు ట్యాక్స్ వేసేవారని.. దీంతో ప్రజలు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ, సవరణలను అమలు చేయడానికి తాను ముందు ఉంటానని ఉద్ఘాటించారు. ఎవరైతే సంపద సృష్టించలేరో వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదని చమత్కరించారు. జీఎస్టీ స్లాబ్‌లలో మార్పు వస్తే ఇబ్బందులు వస్తాయని.. ఆదాయం తగ్గుతుందని ఆర్థిక శాఖ అధికారులు తనకు మొదట చెప్పారని గుర్తుచేశారు. అయితే వారితో దేశమే తొలి ప్రాధానమ్యని .. దాని తర్వాతే ఆదాయమని తాను చెప్పానని అన్నారు. ముందు ఏపీ నుంచి అధికారులు వెళ్లి జీఎస్టీ 2.0 సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఐదు టైర్ల స్లాబ్‌ల నుంచి 2 స్లాబ్‌లకు జీఎస్టీని మార్చడం వల్ల 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈసారి అన్ని పండుగలు ఘనంగా చేసుకునే అవకాశం వస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో సంక్రాంతికి కానుక ఇచ్చామని... ఈరోజు జీఎస్టీ సవరణలతో 12 శాతంలో ఉన్న వారు సున్నా శాతం జీఎస్టీ కిందకు వచ్చేస్తారని తెలిపారు. కొంతమందే ఇలాంటి జీఎస్టీ సవరణలు చేయగలుగుతారని... అలాంటి వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుంటారని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.


11 సంవత్సరాల్లో ప్రధాని మోదీ నిర్ణయాలు చూస్తే ట్యాక్స్ పేయర్స్ 130 శాతం మంది పెరిగారని వివరించారు. జీఎస్టీ బిల్లులు 207 శాతం పెరిగాయని... ఈరోజు రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం జీఎస్టీ ద్వారా వస్తోందని వెల్లడించారు. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు జీఎస్టీ 2.0 సవరణలను వివరించిన తర్వాతనే ఆమోదించారని తెలిపారు. ఇంకా కొంచెం కష్టపడితే డబుల్ డిజిట్స్ సాధించే ఏకైక దేశం భారతదేశమే అవుతుందని నొక్కిచెప్పారు సీఎం చంద్రబాబు.


జీఎస్టీ సవరణలు ఎలా ఉపయోగపడతాయో ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. నిత్యావసరాల్లో చాలా వరకూ ప్రజలకు బెనిఫిట్ లభిస్తుందని తెలిపారు. కార్లు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 28 నుంచి 18 శాతం జీఎస్టీ తగ్గుతుందని.. దీంతో మధ్యతరగతి వారు కూడా ఏసీలు వినియోగించడానికి ముందుకు వస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 06:13 PM