Share News

Pawan Kalyan on GST Reforms: చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:52 PM

జీఎస్టీ సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జిల్లా నుంచి గ్రామస్ధాయి వరకూ ఏఏ బెనిఫిట్స్ జీఎస్టీ సంస్కరణల ద్వారా అమలు అవుతాయో తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan on GST Reforms: చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్
Pawan Kalyan on GST Reforms

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ 2.0 సంస్కరణలపై (GST Reforms) ఏపీ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీర్మానం చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జీఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలను కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ఆమోదించారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆదాయాలకు ఇబ్బందిగా ఉన్నా ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీనే అని ఉద్ఘాటించారు. జీఎస్టీ పన్నుల నూతన విధానం ద్వారా ప్రజలకు మేలు చేసే విధానం మంచిదని.. దీనివల్ల దేశం స్థిరమైన వృద్ధి పెరుగుతోందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.


ఇది ప్రజలు, ఆర్థిక వ్యవస్ధకు చాలా లాభదాయకని నొక్కిచెప్పారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల రేట్లు తగ్గి ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. పాలు, పెరుగుపై పన్ను 5శాతం నుంచి సున్నా శాతానికి అలాగే నిత్యావసరాల ధరలు చాలా వరకూ 18 నుంచి 5శాతానికి తగ్గుతున్నాయని గుర్తుచేశారు. సిమెంట్‌పై పన్నును 28 నుంచి 18కి తగ్గించారని తెలిపారు. అత్యవసర మందులపై జీఎస్టీ పన్ను లేకుండా చేయడం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో సంపద పెరిగి వస్తువుల వాడకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.


జీఎస్టీ విషయంలో అన్ని వాణిజ్య, వ్యాపార సంఘాలు అంగీకారం తెలిపినందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ ఏఏ బెనిఫిట్స్ జీఎస్టీ సంస్కరణల ద్వారా అమలు అవుతాయో తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు పవన్. పరస్పర అవగాహనతోపాటు మీడియా వేదిక ద్వారా ప్రజలకు లాభాల గురించి తెలియజేయాలని కోరారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 05:15 PM