Share News

TTD on Tirupati Brahmotsavalu: భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:31 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు వాహన సేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేలా అవకాశం కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

TTD on Tirupati Brahmotsavalu: భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
TTD on Tirupati Brahmotsavalu

తిరుపతి, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavalu) తిలకించడానికి వచ్చే భక్తులకు వాహనసేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు కూడా నిరంతరాయంగా అన్నపానీయాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఈ మేరకుఇవాళ(గురువారం) ఏబీఎన్‌‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు బీఆర్ నాయుడు.


BR-Naidu.jpg

24న బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు దంపతులు: బీఆర్ నాయుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలుగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) దంపతులు ఏపీ ప్రభుత్వం తరుఫున ఈ నెల 24వ తేదీ సాయంత్రం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కూడా హాజరవుతారని తెలిపారు బీఆర్ నాయుడు.


ఇస్రో సహాయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఎల్ అండ్ టీ సహాయంతో తిరుమలల్లో వాహన పార్కింగ్ ఖాళీలపై భక్తులకు సమాచారాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు. భక్తులకు వాహన సేవ దర్శనమే కాకుండా మూలవిరాట్‌ దర్శనం కూడా సంతృప్తికరంగా జరిగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. స్వామివారి సేవకుడిగా భక్తులకు సేవలు అందిస్తామని, బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం]

రైతులు నమ్మారు.. భూములు ఇచ్చారు.. కరేడు ల్యాండ్స్‌పై మంత్రి అనగాని

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 02:43 PM