Nagababu Meets Pawan: తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:05 PM
సోదరుడు నాగబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 18: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) శాసన మండలి సమావేశానికి తొలిసారి హాజరయ్యే ముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను (Deputy CM Pawan Kalyan) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోదరుడు నాగబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.

అలాగే జనసేన శాసన సభపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక మొదటి సారి సభకు వచ్చిన నాగబాబుకు సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దల సభలో తొలిసారి అడుగుపెట్టిన నాగబాబు అక్కడ జరుగుతున్న చర్చలపై దృష్టిసారించారు. కాగా శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. యూరియా కొరతపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దేనిపైన అయిన చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్క తగ్గలేదు. వైసీపీ సభ్యుల నినాదాలకు పోటీగా టీడీపీ సభ్యులు కూడా సభలో నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
మండలిలో పోటాపోటీ నినాదాలు.. సభ వాయిదా
ఫోటోల కలకలం.. కుప్పకూలిన కాపురం.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News