Share News

Botsa Vs Atchannaidu: మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్న..

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:37 AM

రైతులకు యూరియా సరఫరాతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై ఈరోజు చర్చించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పట్టు బట్టారు. ఈ సందర్భంగా మండలిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Botsa Vs Atchannaidu: మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్న..

అమరావతి, సెప్టెంబర్ 18: రైతులకు యూరియా సరఫరాతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధం కాగా.. వైసీపీ ఎమ్మెల్సీలు.. రైతులకు యూరియా అందడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆయన మాటలకు వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈ సమస్యలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ శాసన మండలి చైర్మన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


అదే సమయంలో మండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ అంశం అత్యవసరమని.. అతి ముఖ్యమైనదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశంపై ఇప్పడే చర్చ జరగాలంటూ ఆయన పట్టుబట్టారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఈ రోజు అజెండా ఉందని.. అందువల్లే ఈ సమస్యపై శుక్రవారం చర్చిద్దామన్నానని తెలిపారు.


అంతేకానీ.. సభలో చర్చించకుండా తాము పారిపోవడం లేదంటూ వైసీపీ నేతలకు ఆయన చురకలంటించారు. ఈ అంశంపై చర్చ జరగాలి.. అసలు వాస్తవాలు ప్రజలకు తెలియలన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది.. ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


అసలు యూరియా సమస్య ఎందుకు వచ్చింది. దీనిని ఎలా పరిష్కరించాం తదితర అంశాలపై చర్చించాల్సి ఉందాన్నారు. అందుకు సమయం ఇవ్వాలంటూ శాసనమండలి చైర్మన్‌ను మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. దీనిపై స్టేట్‌మెంట్ అంటే స్టేట్‌మెంట్ ఇస్తాను. లేదు డిస్కషన్ పెట్టాలంటే డిస్కషన్ పెడతామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సభ ద్వారా చెబితే.. రైతులకు కనీస అవగాహన వస్తుందన్నారు.


ఇంతలో మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ ప్రభుత్వంలో యూరియా కొరతే లేదన్నారు. రైతులు ఎవరూ ఇలా క్యూలో నిలబడలేదని గుర్తు చేశారు. మరి ప్రస్తుతం ఆ సమస్య ఇప్పడే ఎందుకు ఉత్పన్నమైందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందంటూ కూటమి ప్రభుత్వంపై బొత్స మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బ్రెయిన్ ఈటింగ్ అమీబా రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే..

మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

For More AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 11:57 AM