Brain Eating Amoeba In kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే..
ABN , Publish Date - Sep 18 , 2025 | 09:52 AM
బ్రెయిన్ ఈటింగ్ అమీబా విస్తరిస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కేరళలో కొత్త వ్యాధి.. బ్రెయిన్ ఈటింగ్ అమీబా రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇది ఆ రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61 మందికి ఈ వ్యాధి సోకింది. దీని కారణంగా 19 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. గతంలో ఈ వ్యాధి మల్లప్పురం, కోజికోడ్‌లలో మాత్రమే కనిపించేందని చెప్పారు. కానీ నేడు ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి మూడు నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు వస్తుందని తెలిపారు.
నేగ్లేరియా ఫౌలేరి కారణంగా ఈ వ్యాధి వస్తుందని.. దీనినే బ్రెయిన్ ఈటింగ్ అమీనా అంటారని వివరించారు. ఈ వ్యాధి నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ప్రైమరీ ఆమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్ (PAM) అని పిలిచే ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని చెప్పారు. ఈ వ్యాధి వస్తే.. ప్రాణాపాయం తప్పదన్నారు. నిల్వ నీటిలో ఈ ఆమీబా పెరుగుతుందని తెలిపారు. ఇక ఈ కేసులు ఒకే ప్రాంతంలో కాకుండా.. వివిధ ప్రాంతాల్లో వెలుగులోకి వస్తుందని.. దీంతో పరిశోధనలు జరపడం క్లిష్టతరంగా మారిందన్నారు. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
పీఏఎమ్ అంటే ఏమిటి? ఇలా ఇన్‌ఫెక్షన్ వస్తుంది.
పీఏఎమ్ అనేది మెదడును తీవ్రంగా దెబ్బ తిసే ఇన్‌ఫెక్షన్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తొలుత మెదడు వాపునకు గురవుతుంది. దీని ప్రభావంతో బ్రెయిన్‌లోని నాళాలు నాశనం అవుతాయి. ఈ కారణంగా మరణం సంభవిస్తోంది. ఆరోగ్యంతో ఉన్న చిన్నారులు, యువతకు ఈ వ్యాధి సోకే ప్రభావం తక్కువ ఉంటుందని కేరళ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
నిల్వ ఉంచిన నీటిలో ఆమీబా ఉంటుంది. అంటే.. నదులు, చెరువులలో ఈత కొట్టే సమయంలో ముక్కు ద్వారా అమీబా శరీరంలోకి ప్రవేశించి.. నేరుగా మెదడుకు చేరుతుంది. ఈ వాధి సోకితే.. ఒకటి నుంచి తొమ్మిది రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. ఈ నేపథ్యంలో నిల్వ ఉంచిన నీటితో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
అంటే బావులు, వాటర్ ట్యాంకులు, నీటిలో ఈత కొట్టడం కానీ.. స్నానం చేయడం కానీ.. చాలా రిస్క్‌తో కూడుకున్నవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను ప్రభుత్వం స్పష్టం చేసింది. ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలంటూ ప్రజలకు కీలక సూచన సైతం చేసింది. నీరు తాగడం వల్ల ఈ వ్యాధి సోకదని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..
జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్
For More National News And Telugu News