Share News

Dasara Festival: దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..

ABN , Publish Date - Sep 18 , 2025 | 08:11 AM

ఈ ఏడాది దసరా నవరాత్రలు 11 రోజుల పాటు జరగనున్నాయి. ఈ దసరా పండగతో కొన్ని రాశుల వారు జాక్ పాట్ కొట్టనున్నారు.

Dasara Festival: దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..

దసరా నవరాత్రుల్లో అమ్మవారిని భక్తులు వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో ఐదు రాశుల వారి దశ తిరుగుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఏ పని చేసినా కలిసి రావడం.. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుందని వారు అంటున్నారు.


వృషభరాశి: ఈ రాశి వారు.. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అన్ని కలిసి వస్తాయని పేర్కొంటున్నారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతోందని వివరిస్తున్నారు.


మిథునరాశి: ఈ రాశి వారు దసరా అనంతరం తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎవరైతే కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయాలని అనుకుంటున్నారో.. వారి కోరిక నెరవేరనుంది. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సైతం బాగా కలిసి వస్తుంది.


తులరాశి: ఈ రాశి వారికి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండబోతుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఈ రాశి వారి నూతన గృహనిర్మాణం కల నెరవేరనుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. అనుకోని మార్గాల్లో ఆదాయం వచ్చి పడుతుంది. రుణ బాధల నుంచి సులువుగా బయట పడతారు.


సింహరాశి: ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కానీ అనుకోని మార్గాల్లో ఆదాయం వచ్చి చేరుతుంది. విందు, విహార యాత్రలకు ఇది మంచి సమయం. కుటుంబంలో శుభాకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి దేవీ నవరాత్రులు చాలా మంచివని చెప్పాలి.


కుంభరాశి: ఈ రాశి వారికి దసరా అనేక శుభాలను తీసుకు వస్తుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేపట్టినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, కళ రంగాల్లో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకరంగా ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వచ్చే ఆదివారం అమావాస్యకి అంత పవర్ ఉందా..?

మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్

For More Devotional News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 09:38 AM