Share News

AP Legislative Council: మండలిలో పోటాపోటీ నినాదాలు.. సభ వాయిదా

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:06 AM

ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.

AP Legislative Council: మండలిలో పోటాపోటీ నినాదాలు.. సభ వాయిదా
AP Legislative Council

అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ శాసనమండలి సమావేశాలు (AP Legislative Council) ప్రారంభమైన కొద్ది సేపటికే వైసీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా పడింది. సభ మొదలవగానే యూరియా కొరత, గిట్టుబాటు ధరలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అయితే యూరియా, గిట్టుబాటు ధరలపై సమయం కేటాయించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. చర్చకు తము రెడీ అంటూ సమాధానం ఇచ్చారు. ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.


అయితే మంత్రి సమాధానం చెప్పినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. యూరియా కొరత సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవంటూ సిగ్గు సిగ్గు చైర్మన్ పోడియం దగ్గర నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు వైసీపీ సభ్యులు.


అయితే వైసీపీ ఎమ్మెల్సీలకు టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వసతులు కల్పించక పోవడం సిగ్గు సిగ్గు అంటూ ప్రశ్న అడుగుతూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. కాగా.. రేపు బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే చర్చించేందుకు తాము సిద్ధం అని మంత్రి చెబుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలకు నచ్చచెప్పేందుకు చైర్మన్ ప్రయత్నించారు. అయినా వైసీపీ సభ్యులు నినాదాలు ఆపని పరిస్థితి. మరోవైపు సభలో వైసీపీ సభ్యుల నినాదాలకు పోటీగా టీడీపీ సభ్యులు కూడా నినాదాలు చేశారు. రైతు ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేసిన కావలి గ్రీష్మా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో పరిస్థితి గందరగోళంగా మారడంతో మండలి చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి..

ఫోటోల కలకలం.. కుప్పకూలిన కాపురం.. ఏం జరిగిందంటే

జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 11:14 AM